| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 119. వరుస వావి |
| 119. వరుస వావి (కల) |
| సకియ నేను గూడి సరస సల్లాపము లాడుకొంచు వాకిట నిలుచునియుండగ వచ్చె నొక్క బేరగాడు |
| సంతసరుకు లమ్మువాని చెంతజేరి సంతసమున వింతలెల్ల గాంచుచుండు నంతలోన నప్పుడటకు సకియ... |
| చిన్ననాటి చెలిమితోడి చెలులు వచ్చి మమ్ముగాంచి వింతసంతసమ్ము జెలగ "నింతి, యెవ్వరీత?" డనిరి. |
| ముద్దుమోము నెల్లడ ముసి ముసి నగవులు మొలకలెత్త "నరరూపము దాల్చి దిగిన నారాయణమూర్తి" యనియె సకియ... |
| "నరరూపము దాల్చి దిగిన నారాయణమూర్తెగాని అక్కరొ, మీ యిద్దరికిని యెక్కడిదే చుట్టరికము?" |
| వదనము వికసించి వెలుగ బదులుమాట జెప్పకుండ హృదయమునకు గట్టిగ న న్నదుముకొనుచు నవ్వె చెలియ సకియ... |