| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 122. వియోగి విలాపము |
| 122. వియోగి విలాపము |
| కన్నులకు న్నిదురరాదు ఎన్నో చింతలు వేచెడు కన్నె నిన్ను వీడి ఒంటి నిన్ని వెతలు బడుచుంటినె! |
| మెత్తపాన్పుపైన వలపు మత్తత నిను గూడెడు నే నుత్త కటిక నేలను మే నొత్తుకొన బరుంటి నిపుడు! |
| చిలుక పలుకులం బలె వీ నులకు విందుసలిపి వలపు గొలుపు నీదు తియ్యనైన పలుకులు విననోచనైతి! |
| మది గల తమిమంటలార వదలని బిగికౌగిట ని న్నెద నెద గదియించెడు సం పదకు పెట్టి పుట్టనైతి! |
| సొగసు గుల్కు నీదు ముద్దు మొగము గాంచి మది వేచెడు వగపు మఱచి వలపుకలిమి నగుటుండునె యీ జన్మకు? |
| కలలోనైనను కనుపడి చెలియా, యీ దీనుని మది యలజడి యంతయు బోవన్ కలసి వలపు దీర్చలేవె? |