| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 083. నా ముక్తి |
| 83. నా ముక్తి |
| బతుకు బరువు మోయలేక చితికి చివికి డస్సివాడి పికరుపుట్టి పారిపోయి ఒకడనె యేతోటలోనొ పాట బాడుతుండగ నాప్రాణి దాటి యేగేనా? ప్రాణిదాటి యేగుతుండ పాట నోట మోగేనా? |
| పాపఫలము నెత్తణచగ బతుకుతెరువు వేరులేక దాసుడనై దాంపత్యపు తళుకు లొలక చిట్టితొ స య్యాటలాడు తుండగ నా ఆయువు ముగిసేనా? ఆయువుముగిసే అదునుకు ఆటలలో ఎగసేనా? |
| కత్తిపోట్లు తిని తిని కడు గాయమైన పేదగుండె బీతువోవ పరవశాన ప్రియమారగ నాచిట్టిని కౌగిలించుకుండగ నాకాయము సురిగేనా? కాయము సురిగేవేళకు కౌగిలిలో కరిగేనా? |