| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 134. నాస్థితి |
| 134. నాస్థితి |
| వెన్నెల రాత్రిళ్ళు వేగించలేక చుక్కల సొబగుల్లు చూడగాలేక తలవాల్చి నాస్థితి దలచి కుంగేను కుళ్ళి కుళ్ళి లోన కుమిలి పోయేను! |
| రాజులలో కవిరాజునౌ నేను పాడుగుహలో నేడు పారాడనాయె కోకిలలందును పుంస్కోకిలము నేను గొంతునొక్కుకు మూల కూరుచోనాయె! |
| అమృతహస్తా, చిల్కు మమృతబిందొకటి గొంతెండిపోయిన కోకిలనోట! కొయ్యబారిన మేన కోరిక లీన రిక్క పెట్టవె కాస్త చక్కిలిగింత. |