| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 135. ?? |
| 135. ... ... ... ... ... ...? |
| నిష్ఠలేని జన్మ కొసగె నిష్ఠసిద్ధి కనకదుర్గ పాపినైన నాకు పరమపదము జూపె శ్రీరాముడు |
| లోకము నను మోసగించె నాకము న న్నీసడించె ఏకర్మము జేసినాను ఇంత బాధ యేల కలిగె |
| ఆంధ్రమాత నన్ను కాస్త ఆదరించి యున్న యెడల ఇంత దూరదేశానికి యేల వలస రావలయును? |
| ఢిల్లీనగరమ్ము కన్నతల్లిలాగ కౌగిలించి ఉల్లములో చింత దీర్చి ఊపిరి పోసింది నోట |
| కానివేళ చేరదీసి కడుపునిండ తిండిపెట్టి కనికరించె నీ ఢిల్లీ కన్న ఆప్తు లెవరు నాకు? |