| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 081. పలవరింతలు |
| 81. పలవరింతలు |
| చల్లన్ని చిట్టియొడిలోన తల వుంచీ ఆకసమ్మున బాఱుమబ్బులను గాంచీ గలగలని కదలేటి ఆకులను జూచీ అన్నమూ నీళ్ళెందుకనుచు అడిగేను! |
| చిట్టి నాచెక్కిళ్ళు చేతితో నిమిరీ తియ్యగా ప్రేమమ్ము దెల్పేటివేళా చిరునవ్వు నవ్వేటి చంద్రుణ్ణి గాంచీ స్వర్గ మింకేటికని పలువరించేను! |