| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 080. రాజు రాణి |
| 80. రాజు రాణి |
| రాజులలో రాజు నేను రాణులలో రాణి వీవు రాకుమారు డెపుడు కల్గునే నాచిట్టి మనకు? లోక మెపుడు సంతసించునే? |
| కవులకు కవిరాజును నా కావ్యజగద్రాణి వీవు కావ్యకన్య యెపుడు కల్గునే నాచిట్టి మనకు? దివ్యపదవి యెపుడు కల్గునే? |
| నాపాలిటి లక్ష్మి వీవు నీపాలిటి విష్ణువు నే నవమన్మథు డెపుడు కల్గునే నాచిట్టి మనకు భవమోచన మెపుడు కల్గునే? |