| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 170. రామకథాసుధ |
| 170. రామకథాసుధ (శంకరుని రామకర్ణామృతమునుండి) |
| మార్గమందున మార్గమందున వృక్షశాఖల రత్నవేదులు వేదులందున వేదులందున కిన్నరీబృందములగీతము, గీతమందున గీతమందున మంజులాలాపార్ద్రగోష్ఠియు గోష్ఠియందున గోష్ఠియందున నీదుకథయే రామచంద్రా! |
| వృక్షమందున వృక్షమందున వీక్షితములౌ పక్షిసంఘాల్. సంఘమందున సంఘమందున మంజులామోదార్ద్రవాక్యము వాక్యమందున వాక్యమందున మంజులాలాపార్ద్రగోష్టియు గోష్ఠియందున గోష్ఠియందున నీదుకథయే రామచంద్రా! |