| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 171. సీతావిరహము |
| 171. సీతావిరహము (రామవాక్యము) |
| ప్రాసాదమ్మున నీవే! పథము పథమునను నీవే! పృష్ఠభాగమున నీవే! పురోభాగమున నీవే! పర్యంకమ్మున నీవే పలుదిశలందున నీవే కనంబడెద, వౌర, వియో గాతురమౌ నామదికిని. అహో, ఎంత చిత్రమైన దగును నాదు చేతముతీ రపరమేమి తోచదయ్యె నతివమిన్న! నీవుదక్క! నీవే! నీవే! నీవే! నీవే! నీవే! నీవే! అఖిలజగతియందీ య ద్వైతభావ మెట్టిదియో! |