| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 168. వరప్రసాది |
| 168. వరప్రసాది (శాఫోగీతము) |
| పుట్టుదు రింతులు భూమిపైలెక్క కందని యుగ యుగాంతరములదాక ఎంత గాలించినా యీ పృథ్వి యెల్ల నిను బోలు కన్నియ గనరాదు నిజము చాలంగ బ్రేమించి సంతోషమొంది వెఱపన నెట్టిదో యెఱుగని మేటి సమబుద్ధి యనెడు నుత్తమదాన మొసగి నెలత! దేవతలు మన్నించిరి నిన్ను. |