| శతకములు | చెన్నమల్లు సీసములు |
|
| ప్రాణ లింగి స్థలము | |
|
కాయంబునందు నిన్ బాయకుండిన లీలఁ - బ్రాణంబునందునఁ బాయఁడేని వెలయ జాగ్రదవస్థఁ దలఁచిన యమ్మాడ్కి - నలరు స్వప్నావస్థఁ దలఁచెనేని వెలుపలి దృష్టుల వీక్షించు విధమున - భావంబునందునఁ బదిలుఁడేని బాహ్యార్పణంబునఁ బరవశుఁ డైనట్టి - మానసార్పితసావధాని యేని |
|
|
నతనిఁ జెప్పనొప్పు ననిశంబు నతని సాం - గత్య మొప్పు నతనిఁ గన్న నొప్పు నట్లుగాన నీ మహాభక్తి యుక్తులఁ - జేర్చి బ్రోవు నన్నుఁ జెన్నమల్లు. |
22 |
|
కనువిచ్చు కనుదృష్టిఁ గనుమూయఁ గనుఁగవ - వెలుఁగుచు లింగంబు వేళ్లుబారఁ దలఁచు తలంపున నిలుచు సుఖంబునఁ - నెక్కొన లింగంబు పిక్కటిల్ల సోకుఁడు తనువున సొగయుప్రాణంబునఁ - బసిగొని లింగంబు ప్రజ్వరిల్లఁ బలుకుడుపలుకులఁ బలుక నీముఖమునఁ - బరిగొని లింగంబు భరితముగను |
|
|
దగిలి మిగిలి క్రియలఁ దానయై లింగంబు - నిమ్ముకొను నిరంతరమ్ము నట్టు లుల్లసిల్లు లింగయోగానుభవులను - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు. |
23 |
|
సర్వగతైకభావస్వన్మహాలింగంబు - నిత్యసర్వాంగ సన్నిహితుఁ జేసి తనువునం దున్న స్వతంత్రలింగంబు నె - క్కొన మనోభావంబు కొనకుఁ దెచ్చి సన్మనోభావతఁ జను నిష్టలింగంబు - ప్రాణపదంబున భరితుఁ జేసి ప్రాణసంచితుఁ డగు ప్రాణలింగంబును - దనలోన నిడుకొని తాను చూచి |
|
|
బయలునొడల మనము ప్రాణభావంబున - లోను వెలియుఁ దన్నుఁ దాను మరచి లింగగతిఁ జరింపు లింగలింగైక్యులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు. |
24 |
|
నలి ప్రాణలింగంబునకు భూమి మోవని - కొలనిజలంబులు జలకమార్చి పుట్టనిచెట్టునఁ బుట్టిన కెందమ్మి - పుష్పంబుఁ గోయక పూజఁజేసి యడరి యుష్ణముగాని యగ్నిలోన దశాంగ - మిడక ధూపపుఁదాపు లిచ్చపేర్చి తొడరి దీపముగాని తునియలు ముడిపెట్టి - లీల నెత్తకయ నివాళి నిచ్చి |
|
|
రసముగాని యోగిరము గూడ వడ్డించి - యర్పణంబు లోన నలరెనేని శీలవంతుఁ డతఁడు సిద్ధంబు నన్నట్టి - శీలవంతుఁ జేర్చు చెన్నమల్లు. |
25 |