| కర్తృత్వము |
చెనమల్లేశ్వరు పేరిట
సునిశితముగఁ బాలకుఱికి సోమేశుఁడు దా
ఘనభక్తి వెలయఁ జెప్పెను
జెనమలు సీసంబు లనఁగఁ జెలఁగ ధరిత్రిన్. |
36 |
| ఫలశ్రుతి |
ఈ సీసము లేవేళను
భాసురముగఁ బఠనజేయు భక్తుల కిలలో
వాసిగ భుక్తియు ముక్తియు
నాసర్వేశ్వరుఁ డొసంగు ననవరతంబున్. |
37 |
AndhraBharati AMdhra bhArati - shatakamulu - chennamallu sIsamulu shatakamu - pAlakuriki sOmanAtha ( telugu andhra )