| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | చిట్టిపొట్టి మిరియాలు |

| చిట్టిపొట్టి మిరియాలు |
చిట్టిపొట్టి మిరియాలు చెట్టుక్రింద పోసి పుట్టమన్ను తెచ్చి, బొమ్మరిల్లు కట్టి, బొమ్మరింట్లో బోగం పాప కన్నది. బిడ్డతలకు చమురులేదు, నా తలకు నూనెలేదు, అల్లవారింటికి చల్లకుపోతే కలవారి కుక్క భౌవ్ మన్నది! నాకాళ్ల గజ్జెలు ఘల్లుమన్నవి!! |