| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నాహవోదగ్రసురాసురభయద బాహువుల్ పక్షులపాలయ్యె నేఁడు. సురుచిరమృదుశయ్య సొంపొందుమేను పరుషసంగరభూమిఁ బడియెనే నేఁడు? అహితాంధకారబాలార్క బింబములు మహిఁగూలెనే నేఁడు మణికిరీటములు? వినయవిక్రమనయవిఖ్యాతులందు నినుఁబోల రెవ్వరు; నీ యంత వాఁడు 2348కడుపాపమున మించి ‘కష్టుండు ఖలుఁడు బెడిదుండు వీఁ’డనఁబృథివి2349ఁబేఁర్పడితి; తప్పుట తప్పని తలపోయవైతి; చెప్పినమాటలు చెవిఁబెట్టవైతి; 2350విమ్మైన నయమార్గమెఱుఁగలేవైతి; విమ్మన్న జానకి నీ నేరవైతి; మంతనంబున:“రాము మర్త్యుఁగా నీవు చింతింపవల.”దన్నఁజేకొనవైతి. నీ మానగర్వముల్ నిన్నింత సేసె; నేమని శోకింతు నే నింక నీకు? వలదు రామునితోడి వైరంబు;విడువు; చల మొప్ప.”దని నీకుఁజాటనే తొల్లి; నిరుపమనయనిధీ! నీ యట్టిసుకృతి పరసతిఁదల్లిఁగా భావింప 2351వలదె? జగతిలోఁదగవు విచారింప 2352వైతి; తగిలి నా మాటలు తలకూడె నేఁడు.?” అనియని శోకించు, నన్ననేరములు మనమునఁ జింతించు, మఱియు శోకించు. |