| శతకములు | ధూర్తమానవా శతకము |
|
|
తనువెల్లన్ గులపెట్టి జీర్ణసుఖ రు-గ్దద్రువ్యధాపీడచే త నహోరాత్రులు కామతృప్తి కొరకై-దారాడు స్వర్లోక నా థుని పక్షంబయి దానశీలుని మహ-త్పూజ్యున్ బలిన్ సత్యవా క్యనిరూఢున్ బొరియించినా ననుచుఁ బ-ల్కన్ జూతువే మానవా! |
11 |
|
ఒక్కఁడు తండ్రిఁ జంపెనని-యోరిమిలేకయె గండ్రగొడ్డటన్ జక్కడగింప ధర్మువగు-నా కులమంతయు? దీనిజేయ నే నొక్కఁడనే కనంబడితి-నో! యిటువంటివి పూర్వమందు నే దిక్కులనేని విన్పడెనె?-తిక్కవదల్చెద ధూర్తమానవా! |
12 |
|
ఉడుగక తొల్లి పెండ్లమును-నొక్కతె నామెడ కంటఁగట్టి యా బిడ నెవఁడో హరించె నని-వెంగలిమాటలు చెప్పి యామెకై యెడతెగకుండ బావురని-యేడ్చితినంచును నెన్నిరోజులో బడబడ పెద్దగ్రంథములు-వ్రాసితివేమిర? ధూర్తమానవా! |
13 |
|
మిడిమేలంబుగఁ దెచ్చిపెట్టితివిగా-మేనత్తతోఁ గూటమిన్ బడి మువ్వంకల ముండతోడ మధురా-పట్నంబులోఁ గూటమిన్ మెడకుంగట్టితి వెంతవాఁడవుర! నీ-మిట్టాటలన్ మానవా! కడికండల్ తెగఁగోసివైచెదను గా-కశ్రేణికిన్ మానవా! |
14 |
|
అవతారంబులనెత్తి చేయగల న-న్యాయంబు లన్నింటి నే నవతారంబుల నెత్తకుండ మఱి చే-యన్ శక్తిలే దంచు న న్నవమానించితి వింతకాల మిటు? ని-న్నాపాదమస్తంబుగా నివురుంజేసెద నెవ్వరడ్డపడగా-నీ కుండిరో మానవా! |
15 |
|
స్మృతులన్ వ్రాసితి నందు; వాస్మృతులలోఁ-జిత్రించి శ్రుత్యర్థముల్ ప్రతిపాదించితినందు; వయ్యది నిజం-బా? యెంతకాలంబు దు ష్కృతి సాగింతువు, లోకవంచనములన్-జేయింతువో, చేతువో పతితాత్మా, యిఁకనైన యీ వెడఁగు త్రో-వల్ మానవా? మానవా! |
16 |
|
కలలోఁ గన్పడుచుండు బట్టబయలన్-గన్పట్ట రాకుండు గ ఱ్దలు గ్రంథంబులు జెప్పుఁ గట్టెదుటఁ బ్ర-త్యక్షంబుఁ జెప్పండు లో కులు కల్లోలపడంగ నీగతిని ట-క్కుల్ చెప్పు మాయావికిన్ తలతిక్కన్ వదలింతు నీపయిని చి-త్తభ్రాంతిపో మానవా! |
17 |
|
ఈ టకటొంకు లేమిటికి?-నిల్లును వాకిలిఁ గట్టిపెట్టి యే టేటను బెండ్లి సేయుమని-యే నెపుడైనను గోరియుంటినే! చీటికి మాటికిన్ బరుల-జేబులు గొట్టుట ధర్మమార్గమే? ఏటికి నీయబద్ధ మర-రే! యిఁక సాగునె? ధూర్తమానవా! |
18 |
|
బొక్కెడుకూడు పట్టుమని-పొట్టకు తింటినె యొక్కపూటయేన్? జక్కగ నొంటినిండ నొక-జానెడు గుడ్డను గప్పుకొంటినే! ఒక్కటియేని మ్రుచ్చిలిక-యుంచితివే? యిఁక నీదుపాటు లే నక్కయుఁ గుక్కయున్ బడదు;-నా పలుకుల్ విను ధూర్తమానవా! |
19 |
|
పొక్కిలిగడ్డలేక, తన-పొయ్యికిఁ గట్టెలు లేక, మంటకున్ బిక్కినఁ గుండలోనికిని-బియ్యపునూకలు లేక, గంజిలో లెక్కకు నుప్పుగల్లయిన-లేక, కృశించెడి పేదవానికిన్ ఱెక్కలు డుచ్చి సిల్గుల హ-రింతువె చెప్పర, ధూర్తమానవా! |
20 |