| శతకములు | ధూర్తమానవా శతకము |
|
|
ఏఁ బదునాల్గులోకముల-సృష్టియొనర్చుచుఁ బెంచి పిమ్మటన్ దూబవలెన్ హరింతు నని-దొంగనుడుల్ వచియించు చుంటివే! యేఁబదిమాట లేమిటికి?-ఇట్టి ప్రచారము మానకున్నచో గూబలు సాఁగఁదీసెదను-గూయకు మిట్టివి ధూర్తమానవా! |
1 |
|
ఎవ్వరు చూచినారు సృజి-యింపఁగ నీ పదునాల్గులోకముల్ సువ్వన సువ్వి సువ్వి యను-చొప్పెకదా! యొకఁడైనఁ జూచెనే దవ్వులనుండియైన నొక-దానినినైన? వృథా ప్రగల్భముల్! నవ్వుల పాలుఁజేసెదవె-నన్నిటులాడుచు ధూర్తమానవా! |
2 |
|
ప్రతివర్షంబును నా వివాహ మను పే-రన్ బెక్కుచందాల దు ర్మతి చందాలు వసూలుచేసి ప్రతియూ-రన్ గజ్జకట్టింతువే! గతి యీమాత్రములేదె నాకరయ? నేఁ-గావించుకోలేనె? యీ గతి నన్నీవు పరాభవించుటకు సం-కల్పింతువే మానవా! |
3 |
|
కాపురముండ నిల్లు, నడ-కత్తెరలోఁ బడియుండఁ బెండ్లమున్, మాపులు కున్కఁగాఁ బడక-మంచము, నెక్కగ నెక్కిరింతలున్, సాపడఁ బైడికంచమును-జక్కగఁగూర్చి యుపన్యసింతువే? నీపనిఁ బట్టెదన్ వినుము-నీవిది మానవ ధూర్తమానవా! |
4 |
|
కొస కేమౌనొ యెఱుంగకుండ నుసితోఁ-గోణంగివై నీవు నీ పుసికన్నుల్ మసిముక్కు దేబెమొగమున్-బువ్వాడు పెన్బోరెమున్ తొసినోరున్ గలిగించి వంచకుఁడవై-దుర్జాతి, నన్నొక్క మా నిసినిం జేసెదవే! మనుష్యునివలెన్-నేనుంటినే మానవా! |
5 |
|
కాలుంజేతులు ముక్కు మోములును చం-కల్ చన్నులున్ బేర్లు నీ కేలా యున్నవొ; నాకు నట్లెకలవా?-యీరీతిగా నన్ను నీ వేలా వర్ణనచేసినాడ వకటా!-యెందాక సైరింతు? నిన్ పాలార్తున్ మునుమున్న చెప్పితిని నీ-పాట్లన్నియున్ మానవా! |
6 |
|
గుడులున్ గోపురముల్ కుశీలవుఁడవై-కూర్పించి చందాలతో మడిమాన్యంబులు నాదు పేరుననె ని-ర్మాణంబు గావించుచున్ వడపప్పున్ బెరవారి కిచ్చెదవె? నీ-భావంబునం దేమి గీ ల్పడఁగా నేర్చెడి? చెప్పు మింతటి దివా-లాఖోరువే మానవా! |
7 |
|
వేదము లెట్లు బ్రహ్మముఖ-వీథులనుండి హరింపఁగాఁ బడున్; పాదలి సోమకాసురుఁడు-వచ్చి త్రయిన్ హరియించె నంచు నే చీదరఁ బొందకుండ చొఱ-చేఁపను జేసితివే ననున్ - సరే! నీదయమీద నా బ్రదుకు-నిల్చెనె చెప్పుమ ధూర్తమానవా! |
8 |
|
బలి యేపాపముఁ జేసినాఁ డతనిపై-వైరంబు నాకేల? త ద్బలి రాజ్యంబు హరింప వంచకుండనై-ధర్మంబుఁ బోద్రోసి దో ర్బలహీనుండగు నింద్రుఁ బ్రోవ నవతా-రం బెత్తినా నంచు లో కులు నమ్మన్ వచియింతు వింకయిన బొం-కుల్ మానవా? మానవా! |
9 |
|
పరులను, ధర్మదూరులను,-బంధురపాపనిమగ్నచిత్తులన్ గరుణను గాచి ప్రోచుటకు-గా మఱితో బలిచక్రవర్తినిన్ దిరిపెము నెత్తినాఁడ నని-దేబిరిగొట్టుమొగంబ, యెల్లెడన్ నిరతము చాటుచుండెదవె!-నీపనిఁ బట్టెద ధూర్తమానవా! |
10 |