| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
గజరాజవరద కేశవ త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ భుజగేంద్రశయన మాధవ విజయాప్తుఁడ నన్నుఁగావు వేగమె కృష్ణా. |
61 |
| క. |
గోపాల కృష్ణ మురహర పాపాలను బాఱఁదోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నాపాలిటఁగలిగి ప్రోవు నమ్మితిఁ గృష్ణా. |
62 |
| క. |
దుర్వార చక్రధరకర శర్వాణీ భర్తృవినుత జగదాధారా నిర్వాణనాథ మాధవ సర్వాత్మక నన్నుఁగావు సరగున కృష్ణా. |
63 |
| క. |
సుత్రామనుత జనార్దన సత్రాజిత్తనయనాథ సౌందర్యకళా చిత్రావతార దేవకి పుత్రా ననుఁగావు నీకు బుణ్యము కృష్ణా. |
64 |
| క. |
బలమెవ్వఁడు కరిఁ బ్రోవను బలమెవ్వఁడు పాండుసుతుల భార్యను గావ\న్ బలమెవ్వఁడు రవిసుతునకు బలమెవ్వఁడు నాకు నీవ బలమౌఁ గృష్ణా. |
65 |
| క. |
పరుసము సోకిన యినుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వ\న్ హరి నీ నామము సోకిన సురవందిత నేను నటుల సులభుఁడ గృష్ణా. |
66 |
| క. |
ఒకసారి నీదునామము ప్రకటముగాఁ దలఁచువారి పాపము లెల్ల\న్ వికలములై తొలఁగుటకును సకలార్థ యజామిళుండు సాక్షియె కృష్ణా. |
67 |
| క. |
హరి సర్వంబునఁ గలఁ డని గరిమను దైత్యుండు పలుకఁ గంబములోన\న్ ఇరవొంది వెడలిచీల్చవె శరణనఁ బ్రహ్లాదుడిండు సాక్షియె కృష్ణా. |
68 |
| క. |
భద్రార్చిత పదపద్మ సు భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ భద్రాధిప కేశవ బల భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా. |
69 |
| క. |
ఎటువలెఁ గరిమొఱ వింటివి ఎటువలెఁ బ్రహ్లాదు కభయమిచ్చితి కరుణ\న్ అటువలె నను రక్షింపుము కటకట నినునమ్మినాఁడ గావుము కృష్ణా. |
70 |