| శతకములు | దేవకీనందన శతకము |
|
| మ. |
నినునెవ్వాఁడు దలంచు నీమహిమ వర్ణింపంగ నెవ్వాఁడు నే ర్పునఁబూను\న్ నినుగొల్చునట్టిఘనుఁ డాపుణ్యాత్ములోకైకమా న్యునిఁగా ధన్యునిఁగా వివేకనిధిఁగా నుద్యద్గుణాంభోధిఁగా ననిశంబుం గొనియాడఁ గోరుదురు కృష్ణా దేవకీనందనా. |
21 |
| శా. |
శీలంబు\న్ గులము\న్ వివేకనిధి లక్ష్మీకాంతవక్షస్స్థలి\న్ హాళింబాయకయుండు కాముకుఁడవై హంకారవృత్తి\న్ సదా స్త్రీలోలుండన రాధతోఁ బెనఁగుట ల్చిత్రంబులు న్నౌర నీ జాలం బే మని సన్నుతించెదను కృష్ణా దేవకీనందనా. |
22 |
| శా. |
శ్రీలక్ష్మీధవ రుక్మిణిం గలసి కూర్మి\న్ మిత్రవందా సుదం తాలోలాక్షులఁ గూడి జాంబవతి సత్యాలక్ష్మణాభద్రల\న్ కాళింది\న్ మరుకేళిఁ దేల్చితివి శృంగారాంగగోపాంగనా జాలంబు\న్ దనియింతు నౌర తుదఁ గృష్ణా దేవకీనందనా. |
23 |
| శా. |
మద్దు ల్గూల్చినలాగొ వేగ మనిలో మన్నించి గాండీవికి\న్ బుద్దుల్ సెప్పినలాగొ మోదరసముప్పొంగ\న్ యశోదమ్మకు\న్ ముద్దుల్గా నటియించులాగొ వరుస\న్ మువ్వేళల\న్ వేడుక\న్ చద్దు ల్మెక్కి రహించులాగొ ధరఁ గృష్ణా దేవకీనందనా. |
24 |
| మ. |
చరణాబ్జంబులు వీడ్వడ\న్ నిలచి యోజ\న్ దట్టిలో పిల్లఁగ్రోల్ కర మొప్పారఁగ నుంచి యింపొందవఁ జంక\న్ గోలనందిచ్చి బ ల్వురుగోపాలురు జుట్టునుంగొలువ వేల్పుల్ గ్రుక్కిళుల్మ్రింగఁగా నరయం జల్ది భుజింపవే యడవిఁ గృష్ణా దేవకీనందనా. |
25 |
| మ. |
మెఱుఁగుల్దేఱు మహేంద్రనీలనిభమౌ మేన\న్ సమీపాటగో ఖుర నిర్ధూత ధరాపరాగలవ పంక్తుల్గప్పఁగా నొక్కచేఁ బురిగోలొక్కటఁ బాలకుండఁ గొనుచుం బొల్పొంగ గోధుగ్జనాం తర వర్ధిష్ణుఁడవైన ని\న్ గొలుతుఁ గృష్ణా దేవకీనందనా. |
26 |
| శా. |
అధివ్యాధిహరంబు జన్మమరణవ్యాపారదుష్కర్మ దు ర్బోధావ్యాప్తినివారణంబు సతతస్ఫూర్జ జ్జగద్రక్షణో న్మేధాయుక్తము భక్తవాంఛితఫలానీకప్రధానైక దీ క్షాధౌరేయము నీమహామహిమ కృష్ణా దేవకీనందనా. |
27 |
| శా. |
హాలాహాలశిరోధిమౌళి నయనోద్యద్భీమ ధూమధ్వజ జ్వాలాభీలకరాళరూక్ష విషనిశ్వాసోష్ణకృష్ణానదాం భోలీలాస్పద కాళియస్ఫుటనటద్భోగాగ్ర మధ్యంబున\న్ హాళి\న్ దాండవమాడు ని\న్ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా. |
28 |
| మ. |
తినదేచెట్టున నాకు మేఁక గుహ గొందిం బాము నిద్రింపదే వనవాసంబునఁ బక్షులు\న్ మృగములు\న్ వర్తింపవే నీటిలో మునుకల్ వేయవె మత్స్యకచ్ఛపములు న్మోక్షార్థమౌ ముక్తికి\న్ మనసే మూలము నీదుభక్తులకు కృష్ణా దేవకీనందనా. |
29 |
| శా. |
వింటిం గొంతగ మీమహత్వమును నుర్వి\న్ దర్శనప్రాప్తిచే ఘంటాకర్ణుని నుగ్రసేనతనయుం గైవల్యతేజంబు ని న్నంటంజేయవె మాటమాత్రమున నిట్లాశ్చర్యము\న్ బొందఁగా నంటం బొందనివేల్పు ని\న్ గొలుతుఁ గృష్ణా దేవకీనందనా. |
30 |