| శతకములు | దేవకీనందన శతకము |
|
| మ. |
అరయం జందనగంధిపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ బరఁగంగల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా దేవకీనందనా. |
91 |
| మ. |
అనుకూలాన్వితయైన భార్యయును ధర్మార్థంబునైనట్టి నం దనులు\న్ సజ్జనులైన సోదరులు యెన్నంగల్గు సంపత్క్రియా ఘనుఁడైనట్టి మహానుభావుఁడె భవత్కారుణ్యదృగ్జాలభా జనుఁ డప్పుణ్యుని జూచిన\న్ శుభము కృష్ణా దేవకీనందనా. |
92 |
| మ. |
శరణాగత్యనురక్తి భక్తి జనరక్షాసత్కృపాసేవ్యస త్కరుణాపూర సుధారసంబుగల శృంగారంబు మీమూర్తియుం దరణోపాయ మెఱుంగలేని కలుషాధారు\న్ ననుందావక స్మరణాధీశునిఁ జేయు మ్రొక్కెదను కృష్ణా దేవకీనందనా. |
93 |
| మ. |
ప్రలయాభీల కరాళదావదహన ప్రజ్జ్వాల మబ్జోదరా జ్వలనాకారముదాల్పఁ దానియెదుట\న్ సంతప్త సంతాప వాం ఛలు దివ్యుల్మునులుం గృశాస్యులగుచుం జల్లార్పఁగాలేక ని చ్చలు నీపాదములే భజించెదరు కృష్ణా దేవకీనందనా. |
94 |
| మ. |
మొఱయాలింపవొ మానమున్నిలుపవో ముల్లోకమేలింపవో మఱదీయంచును వెంటనేతిరుగవో మన్నింపవో యందుమో కరినో ద్రౌపదినో సురాధిపతినో గాండీవినో యెవ్వఁడ\న్ ధర ని\న్ గొల్చినవారిలో నొకఁడ కృష్ణా దేవకీనందనా. |
95 |
| మ. |
కుటిలారాతినిశాటకోటికదళీకూటాటవీభంజనో ద్భటమత్తద్విపకేళిలోలము సముత్ప్రావీణ్య దైత్యాంగనా స్ఫుట ముక్తామణిరత్నహార తిలకాపుంజాతలూనక్రియా చటులజ్వాలము నీసుదర్శనము కృష్ణా దేవకీనందనా. |
96 |
| మ. |
కులిశానేక సహస్రకోటి నిశితక్రూరోరుధారాముఖా కలితార్చి ప్రభవ ప్రభావ త్రిజగత్కల్యాణసంధాయియై విలసిల్లు\న్ భవదీయచక్రమఖిలోర్వీభారనిర్వాపణో జ్జ్వలనిర్వాహపరాక్రమక్రమణ కృష్ణా దేవకీనందనా. |
97 |
| మ. |
అతికాకోల కరాళ కాయక కఠోరాశీ విషావిర్భవ క్షతినోనాటిన నాఁటిపాటు తలఁప\న్ శంకించి యుంకించె దౌ సతతోద్వర్తుల వర్ణ సర్వభయదాంచత్పింఛ చూడావతం సతతం గారుడకేతనోద్ధృతియు కృష్ణా దేవకీనందనా. |
98 |
| శా. |
నక్రోదగ్రతఁ బ్రాణవాయువులు మేన న్నిల్వఁగా నోప వో చక్రీ న\న్ దయ గావు మన్నకరుణ\న్ జాజ్జ్వల్యచక్రంబుచే నక్రంబుం దెగఁ జూచి కాచితిగదా నాగంబు వేగంబున\న్ శక్రాద్యామరవందితాంఘ్రియుగ కృష్ణా దేవకీనందనా. |
99 |
| మ. |
కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్ మెచ్చి యిచ్చింది ద బ్బర కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో శరణన్న బగవానితమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్ల యి త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా దేవకీనందనా. |
100 |
| క. |
ఈకృష్ణశతక మెప్పుడు పైకొని విన్నట్టివారు వ్రాసినవారల్ చేకొని పఠించువారలు శ్రీకృష్ణునికరుణ కలిగి చెలఁగుదు రెలమిన్. |
101 |