| శతకములు | దేవకీనందన శతకము |
|
| శా. |
రక్షింపం దగువీరుఁ డెవ్వఁ డననీరాజుల్ వృథాతేజులే మోక్షశ్రీయొసఁగు\న్ విభుండెవఁడు శ్రీమోహాకృతి న్దేవతల్ రక్షోజాక్ష శుభప్రధానగరిమ\న్ రాజిల్లురాజేంద్రుల\న్ సాక్షాద్బ్రహ్మము నీవె ధన్యులకుఁ గృష్ణా దేవకీనందనా. |
41 |
| మ. |
కొలిచేది\న్ వగలేకనే నడిగితే కోపించు టీలేకనే చెలువం బెచ్చుటకోటనేవిభవముల్ చేకూరుటల్ రూకనే బలవంతుం డగుమూకనే సతిచెడు\న్ ప్రాణేశుపైఁ గోపనే జలదశ్యామల శంఖచక్రధర కృష్ణా దేవకీనందనా. |
42 |
| మ. |
బలశౌర్యోన్నతి శత్రులం గెలిచి సప్తద్వీపవిశ్వంభరా స్థలి నేలించి సమస్తవైభవములన్ దీపించి దిక్పాలకా వళి కీర్తింప మెలంగునైషధుఁడు దా వర్తింపఁడే తొల్లి వం టలవాఁడై ఋతుపర్ణుచెంగటను కృష్ణా దేవకీనందనా. |
43 |
| మ. |
ధరలో గోళకుఁ డైనపాండునికళత్రం బందు వేర్వేఱనే వురకు\న్ బుట్టినపాండునందనులు దివ్యుల్మెచ్చ వర్తింపఁ ద చ్చరితం బంతయు భారతంబని ప్రశస్తంబయ్యె నీనామసం స్మరణప్రౌఢిమఁ గాదె యీఘనత కృష్ణా దేవకీనందనా. |
44 |
| మ. |
క్రతువుల్ నూఱొనరించి యింద్రపదవిన్గర్వించియింద్రాణికై ధృతిఁదూల\న్ మరుఁడేచఁగా నహుషుఁడద్దేవేంద్రుభోగానుసం గతిగాఁ గోరినకుంభసంభవుఁడు గిన్క\న్ దిట్టిన\న్ జెందఁడే సతతంబు\న్ పెనుబాముచందమును కృష్ణా దేవకీనందనా. |
45 |
| మ. |
ఘనుల\న్ నీచుల నీచుల\న్ ఘనుల సత్కారాఢ్యుల\న్ దుష్క్రియా జనితోద్యోగుల నర్థవంతులను భిక్షాయుక్తుల\న్ భిక్షుల\న్ ధనికవ్రాతముగా నొనర్చుచును నిత్యంబు\న్ మహాగారడం బని నందించు వినోదరాయ హరి కృష్ణా దేవకీనందనా. |
46 |
| శా. |
శ్రీలక్ష్మీధవ వాసుదేవ వరదా రాజీవపద్మాసనా వ్యాళాధీశ్వర శర్వ షణ్ముఖ శుకాద్యస్తోత్ర సత్పాత్ర గో పాలానీక ముఖాబ్జభాస్కర కృపాపాథోధి న\న్ గావు మూ ర్ధాలంకార మయూర పింఛధర కృష్ణా దేవకీనందనా. |
47 |
| మ. |
పతులున్నేవురునెన్నఁగాఁగలిగి భూపాలాంగనానీకముల్ సతతంబు\న్ గనుసన్నల\న్ మెలఁగుచైశ్వర్యంబుతోనుండి తా నతిభక్తిం జని యాసుధేష్ణకును జేయం బూనదే ద్రౌపదీ సతి యాశ్చర్యము నీవిలాసములు కృష్ణా దేవకీనందనా. |
48 |
| శా. |
మీసామర్థ్యము గల్గునంతకును నెమ్మి\న్ బాండుసూనుండు నా యాసం బొంద మహాద్భుతంబుగ విరాటాధీశుపట్ణంబులో గ్రాసోపాయము లేక భిక్ష మడుగ\న్ గాషాయముంబూని స న్యాసంబు\న్ ధరియింపఁడే యచటఁ గృష్ణా దేవకీనందనా. |
49 |
| మ. |
విరటుం గొల్చినవాఁడు నొక్కఁడిలఁ బృథ్వీనాథుల\న్ గూల్చి సం గరభూమి\న్ ఘనవైరివీరతతులన్గారించుచు\న్ ద్రుంచి యి ద్ధరకు న్నగ్రజు రాజుఁ జేసియు తుది\న్ దా నీకృపంబాయఁడే సరిపోదే భువి నింద్రసూనుధృతి కృష్ణా దేవకీనందనా. |
50 |