| శతకములు | దేవకీనందన శతకము |
|
| శా. |
బొంకు ల్లక్షలు నిత్యసంభరితసంభోగారతుల్ దుర్మదా హంకారంబులు కోట్లసంఖ్యయగు మోహంబాయనంతంబు దు ష్పంకాభార మపార మిన్నిగల భూపవ్రాతసర్పాళి ని శ్శంకం బ్రాజ్ఞులు చేర వోవుదురె కృష్ణా దేవకీనందనా. |
71 |
| శా. |
చీమల్ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించిన\న్ పాముల్ జేరినరీతి లోభిజనసంపన్నార్థరాసుల్ వృథా భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులే లొల్లరో సామాన్యంబు ధనాధినాథులకుఁ గృష్ణా దేవకీనందనా. |
72 |
| మ. |
అదనం బొద్దులనీడచందమున నిచ్చల్ సృక్కి దుష్టాత్ముసం పద పెంపై ధరనిల్వదించుకయు సౌభాగ్యప్రభాభాసియై పొదలు\న్ మాపటినీడకైవడి భవత్పూజావిధేయజ్ఞుఁడై సదయుం డైనను లేమి జేకురునె కృష్ణా దేవకీనందనా. |
73 |
| శా. |
కీడు\న్ మేలును వచ్చుఁ గర్మవశత\న్ క్రీడాగతి\న్ జోకలై వాడల్ వచ్చును బండ్లునొక్కెడధర న్నొక్కప్పుడు\న్ బండ్లపై వాడల్ నౌఁ గద దేశకాలగతి శీతోష్ణంబు లీరీతి నే జాడ\న్ వచ్చును దుఃఖసౌఖ్యములు కృష్ణా దేవకీనందనా. |
74 |
| శా. |
అంతశ్శత్రుల గెల్వలేరు మమతాహంకారము ల్మానలే రింతే మూర్ఖము వీడలేరు భవదీయాంఘ్రిద్వయీచింతనా చింతారత్నముఁ గానలే రిలను దుశ్చిత్తు ల్వృథా వేదవే దాంతంబుల్ చదువంగ నేమి యగుఁ గృష్ణా దేవకీనందనా. |
75 |
| శా. |
నానావేదపురాణశాస్త్రముల నానందింపఁగా నిత్య మిం పౌనార్యు ల్వినుతింప ధార్మికరహస్యంబు ల్విన న్వచ్చునౌ మీ నామాంకభవద్వివేకులకు మున్నాశ్చర్యమే సత్వరా జ్ఞానాధిక్యము గానిముక్తిఁ గని కృష్ణా దేవకీనందనా. |
76 |
| శా. |
గట్రాల\న్ బలుకానల\న్ గుహల గంగాసింధుదేశంబుల\న్ వట్రాఠావుల దేహమెల్లఁ జెదర\న్ వర్తించిన\న్ మేరువు\న్ చుట్రా యేఁబదిమార్లు మెట్టినమనశ్శుద్ధుండు గాకుండిన\న్ చట్రా వాని ప్రయాస మంతయును గృష్ణా దేవకీనందనా. |
77 |
| శా. |
గంగాజన్మపదాబ్జమందు నభిషేకంబు ల్సదా గాంచెదన్ నంగారార్చనచేసి యేరణమున\న్ నర్పింతు నంభోధరా శృంగారాధిప కౌస్తుభాభరణ యేశృంగారముల్ జేతు మీ కంగీకారము గాఁగ నాతరమె కృష్ణా దేవకీనందనా. |
78 |
| మ. |
అతిమోహాంధులఁ బాపకర్ముల మహాహంకారుల\న్ దోషదూ షితుల\న్ గర్వితదుర్విచారులఁ బ్రశంసింపం బ్రశంసింపఁగా దితిపర్యాప్తిదినంబు లొంది త్రిజగద్విఖ్యాతియుష్మత్సము న్నతసేవాభిముఖుండ నైతి నిట కృష్ణా దేవకీనందనా. |
79 |
| మ. |
పలుమాఱు\న్ ఇహభోగకాంక్షసభల\న్ పాండిత్యముల్ సేయువా రలయజ్ఞానము మాన్పఁగాఁ గలరె యెట్లైన\న్ బ్రకాశించు కో మలదీపాళిఁదొలంగఁ ద్రోయునె భవన్మాయాంధకారంబును జ్జ్వలితానందమయ స్వరూపయుత కృష్ణా దేవకీనందనా. |
80 |