| శతకములు | వేంకటేశ శతకము |
|
|
కవితోడ నలిగినఁ గానిపద్యముజెప్పుఁ, గడుముచ్చుఁ దడవినఁ గన్న పెట్టు ధనికుతోఁ బోరినఁ దను జట్టిగాఁగొను, బశుకర్ము నొరసినఁ బదరిపొడుచు బట్టుతోఁ గినిసినఁ బలు తెఱంగులఁ దిట్టు, మూర్ఖుని జెనకిన మురియఁగొట్టు జేరి యమాత్యు మించిన భంగమండరించు మర్మజ్ఞుఁ దొడరిన మద మడంచు |
|
|
నట్లు గావున నసమాన మైనవైర, మెట్టివారికిఁ దగవుగా దెంచి చూడ కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
21 |
|
ప్రాయంబు గలనాఁడె పంతంబు లీడేఱు, బలిమి గల్గిననాఁడె పరఁగు జయము సంపదగలనాఁడె జరగు సౌఖ్యములెల్లఁ, దనువుగల్గిననాఁడె ధర్మ మెసఁగుఁ బిలుపుగల్గిననాఁడె ప్రియములు సిద్ధించుఁ, బోఁడిమిగలనాఁడె పొసఁగుమాట మన్ననగలనాఁడె మనవిజేకూరును, జనవుగల్గిననాఁడె సరస మమరు |
|
|
మోసపోయిన మఱిరాదు మొదలిచంద, మెఱిఁగి నడచినవాఁడెపో యెక్కుడెందు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
22 |
|
ధరణిదారిద్ర్యంబు దైన్యంబు నొందించు, బహుభీతి కార్పణ్యపడఁగఁ జేయు శంక యూరకయైన సరిదోడు వెదకించుఁ, బలులంపటుత్వము ల్భంగపఱుచుఁ దనసిగ్గు దనుదానె తలవంచికొనఁ జేయుఁ, జేసిననేరమి చింతఁ గొలుపు దడి నీచకృత్యంబు దహమాన మొదవించుఁ, జెందివృద్ధత్వంబు శిథిలపఱుచుఁ |
|
|
దనువిదారంబు లివియపో దర్పమణఁచు, నవ్వినట్లనె యెట్టిమానవునినైన కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
23 |
|
సంసారి కనుచరించకపోవ దధిపుల, నంగనాసహితుల కడఁగ రాదు పుత్త్రవంతునకును బోదు యాచింపక, భువి గృహస్థున కాడి బొంకరాదు క్షుధితున కేమేనిఁ గూడఁ బెట్టకపోదు, క్షేత్రవంతున కప్పు సేయరాదు బంధుపోషకునకు భారమానకపోదు, దేహధారికిఁ గాంక్ష ద్రిప్పరాదు |
|
|
నరులకెల్ల వైరాగ్యంబునడచుటెట్లు, రమణతో నినుగొల్చు వారలకుఁగాక కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
24 |
|
సుముఖుఁ డౌటకు నవ్వుచూపులే యిక్కువ, యింపొంది మెచ్చుటకీగి గుఱుతు కూడియుండుట కోర్చుకొనుటయ సూచన, మన్నించుటకు మంచిమాటయెఱుక వెస నమ్ముటకుఁ జాడి వినకయుండుటె చిహ్న, చేపట్టుటకుఁ బొరసినది సన్న దయదలంచుటకును దప్పు మానుటెసాక్షి, లలినేలుటకు నింపు లక్షణంబు |
|
|
స్వామియగువాఁడు భటునకుఁ జనవులొసఁగి, మనుపఁ దలఁచిన యట్టి సన్మార్గమిదియ కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
25 |
|
దయతోడదీనుని దైన్యంబు వాపుట, చెడినమానవుని రక్షించికొనుట పేదకునర్థంబు పిలిచి తానిచ్చుట, కడలేని యార్తుని గాచికొనుట శరణుఁ జొచ్చినవాని జనవిచ్చి మనుపుట, యెదుటఁ బడ్డయనాథు నేలికొనుట చంపఁ దెచ్చినవాని చావుమాన్పించుట, యగతికుం డగురోగి నరసికొనుట |
|
|
లింతకంటెను బుణ్యంబు లెందుఁగలవు, ధరణిపతులకు నరయ భూతలమునందు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
26 |
|
చెఱుపరానిమనుష్యుఁ జెల్లదు కోపింప, వాఁడు చేఁజిక్కిన వదలఁ జనదు విశ్వాసి యగువాని విడుచుట యవినీతి, ద్రవ్యాపహారిని దగదు మనుపఁ బాపాత్ముఁ డైనట్టి బంటు నేలఁగరాదు, ధర్మాత్ము నలఁగింపఁ దగవుగాదు బుద్ధిచెప్పినవాని బోలదు భర్జింప, నపరాధరహితుపై నలుక వలదు |
|
|
వరుసనారసి యధిపులు వారి వారి, గుణములెఱుఁగుచుఁ గార్యంబు గొనఁగఁవలయు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
27 |
|
సముఁడైన శత్రుతో సంధిచేయుట కార్య, మెక్కుడైనను గప్పమిడఁగవలయుఁ దఱి నల్పదళమైన దండెత్తగాఁదగుఁ, దొలఁగి దాఁగినను బోద్రోలవలయు నిద్దఱైనను భేద మెసఁగఁజేయుట యొప్పుఁ, గాకగగ్గోలుగాఁ గడపవలయుఁ జనకున్న శత్రువు సంహరించుటలెస్స, యొండె ముట్టడి చేసి యుండవలయు |
|
|
రమణ నీరీతిఁ దలపోయ రాజనీతి, యిట్లునడచిన విభుఁడిల యెల్లనేలు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
28 |
|
గరిమ నేలికలేనికయ్య మేడకు నెక్కు, నానాజ్ఞలేని రాజ్యంబు జడియు బహుధనంబులు లేక బల మేపనికివచ్చు, బలములేని ధనంబు బ్రాఁతిగాఁదు ధర్మంబు లేని యాస్థానమంతయు వృథ, సామునేరనిపోటు సరవిగాదు సవరణలేని విశాలదుర్గమంబేల, గట్టితాణెము లేనిగడి నశించు |
|
|
లంకెలొకటికినొకటి లాగుదెలియ, వరుసదప్పక ధరయేలువాఁడెరాజు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
29 |
|
చెఱయుఁగొల్లయు లూటి సీమలోలేకుండ, దండెత్తవలయు శాత్రవులమీఁద గడ్డియు దవసంబుఁ గడు నీరు గల్గుచోఁ, టరసి పొందుగ విడియంగవలయుఁ గైకొన్న భూములఁ గాఁపుగాఁ దాణెంబు, లొనరించి మరి యవ్వ లొత్తవలయు గజము గుఱ్ఱము బంటు గాసి పొందకయుండ, లలిఁబోరఁబరగఁ గెల్వంగవలయు |
|
|
బుద్ధిఁబదరక యెప్పుడు భూవిభుండు, మెల్లనే బాహుశౌర్యంబు మెఱయుటొప్పు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
30 |