| శతకములు | వేంకటేశ శతకము |
|
|
భూమియే దేహంబు పోలించిచూచిన, రాజుప్రాణంబు శౌర్యంబు శిరము గడియించినధనంబు ఘనతరాయుష్యంబు, మతి సత్ప్రధాని ధర్మంబు జోడు కరచరణాదులు కరితురంగంబులు, ఘనవిచారమునీతి కరుణదేవి బలు పైనదుర్గము ల్పంచేద్రియంబులు, సరవిఁ జైతన్యంబు సర్వబలము |
|
|
కాలపురుషుండవై నీవుఘటనమెఱసి, చేయుచుండుదు రాజ్యంబు చెలగిచెలగి కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
81 |
|
ఇచ్చకం బాడిన హిత మౌను విభునికి, మఱి దిసంతడచిన మనసు విఱుగు నొదిగివర్తించిన నొడబడి దయపుట్టు, బంతంబు మెఱసిన బగలు రేగు నోర్పుతో గొలిచిన నొసగజూచు ధనంబు, లడుగగోరిన వేసటగును మిగుల దలపుతో మెలగిన వెలయు సంతోషంబు, లెరవెరవై యున్న నెడయుభక్తి |
|
|
మంత్రియగువాడు కార్యక్రమముననిట్లు, తెలిసి నడచిన శుభములు తేటపడును కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
82 |
|
అడుసు చేతుల దివియగవచ్చు నొకవేళ, బలిసి యెండిన గడ్డపాఱ వలయు నాకటివేళనే యన్నంబు రుచియగు, దనిసిన నోకిలింతలు గడంగు తతితోడ విత్తిన దఱచుగా బండు జే, నెప్పుడైన విత్తిన నీచబోవు బంటు నాయావేళఁ బనిగొనవలె గాని, యలవాటు దప్పిన నడచిపడును |
|
|
వేళవేళల గార్యము ల్వెలయజేయు, వలయు నొకయింత దప్పిన వశము గావు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
83 |
|
అడవిలోపలిరాజ్య మదియొల్ల మనరాదు, బలువుఁడు పైకొన్న బాధసేయుఁ గ్రూరవర్తనునైన గూర్చియేలుటదగుఁ, బగఱగూడిన వాడుభయమొనర్చు గడినున్నవానితోఁ దొడరుచుండుట యొప్పు, నూరకుండిన నతండొత్త జూచు బలుమాఱు బంటుల బౌజు జూచుట మేలు, గర్వింతురిటువలె గాకయున్న |
|
|
నృపుల కేమఱి యుండుట నీతిగాదు, బహువిధంబుల నెచ్చరి బ్రతుకవలయు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
84 |
|
దానపాత్రుల కిచ్చుద్రవ్యంబు ఫలియించు, విటుల కొసంగిన విఫలమగును మంత్రపూతాగ్ని హోమము తన్ను రక్షించు, బూడిదలో వేల్మి పున్నె మీదు కాలోచితం బగుకర్మ మీడేఱించు, వేళదప్పినసంధ్య విధికి వెలితి యొరులకునుపకార మొనరింప శుభమిచ్చు, బరపీడ చేసిన నరక మొదవు |
|
|
నెఱిగిచేసిన ధర్మంబు లెపుడు మనుపు, నెఱుక మాలినకృత్యంబు లేమిబ్రాతి కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
85 |
|
హితబుద్ధి నడుగుమహీశుండు గల్గిన, దెలివి బోధించుమంత్రియును గలుగు వెఱ పేమియును లేనివీరుండు గలిసిన, దగుపరివారంబు దానె కలుగు బొందు సేయగ నేర్చు పురుషుండు గలిగిన, ఘనుడైన చెలికాడు గలిగియుండు ఘనరసస్థితి యెఱిగినవాడు గలిగిన, గడు మెచ్చ జెప్పెడు కవియు గలుగు |
|
|
వేసరక మంచివారిని వేడవలయు, దలచి చూచిన నివియెల్ల దైవఘటన కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
86 |
|
తొల్లి పెట్టనిమేలు తొరలి యిప్పుడు రాదు, కావలసినపను ల్గాక పోవు చేసినకర్మంబు చెందక మానదు, రాగలయర్థంబు రాకపోదు దైవసంకల్పంబు తప్ప దెంతైనను, దనువికారంబులు తగులు నెపుడు లోకధర్మమునకు లోనుగా మనరాదు, తగిన భోగంబులు తామె కలుగు |
|
|
వేగిరింపఁగ వలవదు విమలమతికి, సకలమున కోర్చియుండిన సౌఖ్యమొదవు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
87 |
|
నిక్కంబువలె నుండు నిండుసంసారంబు, మొలచినయట్లుండు మంచిసిరులు కాయంబుదక్కినగతి నుండు దలపోయ, దనది యైనట్లుండు నొనరిగృహము సతములైనట్లుండు సరసాన్న పానము, ల్పాయనియట్లుండు బాంధవంబు లమరినట్లుండుదు రట బుత్త్రపౌత్రులు చేఁ జిక్కినట్లుండుఁ జిత్తమెపుడు |
|
|
నింద్రజాలంబొ స్వప్నంబొ యిదియునొక్క, సిద్ధవిద్యయొ కంటి నీ చేతలెల్ల కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
88 |
|
ధరలోన నావులు తమదూడలకునెల్ల, బెట్టెనా వాములు ప్రియముతోడ బొక్కలు త్రవ్విచ్చి పోయెనా నక్కలు, తమపిల్లలకు నిరంతము నుండ దలచి దప్పిక నీళ్ళుత్రావ గూనలకును గట్టెనా చెఱువులు కప్పలెల్ల బ్రియముతో రతిసల్పి బిడ్డల గనుమని చెప్పెనా సింహంబు శిశువులకును |
|
|
వట్టిభ్రమతల దమపుత్రవర్గమునకు, దల్లిదండ్రులు దలతురు ధనముగూర్ప కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
89 |
|
ముదిమి తీగెలువాఱి ముంచినకైవడి గడు మేన నరములు గానిపించు దనమేను గనుగొని తానె నవ్వెడుక్రియ, మీసలు గడ్డంబు మిగుల నరయుఁ బంచేంద్రియములకు బరగనోడితి నని వెన్నుచూపినరీతి వీపు వంగు నుప్పతిల్లినమద ముబ్బు దీసినరీతి నేర్పెడు బుడువులై యెమ్ము లెల్ల |
|
|
నిట్టిజరచేత జిక్కియు నెడ్డెనరుడు మనసుదనియక భోగించు మనసువెట్టి కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
90 |