| శతకములు | వృషాధిప శతకము |
|
| శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వలకీర్తి! సత్క్రియో ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే |
1 | |
| చ. |
ప్రమథవిలోల! భక్తపరిపాల ధురంధరశీల! సంతతా స్తమిత సమస్తదేహ గుణజాల! సుఖప్రదలీల! లింగ జం గమ మహిమానుపాల! గతకాల సమంచిత నాదమూల! దే వ మము భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
2 |
| ఉ. |
అప్రతిమప్రతాప! సముదంచిత నాదకళాకలాప! దీ ప్త ప్రమథస్వరూప! శివభక్తగణాత్మ గతప్రదీప! ధూ త ప్రబలేక్షుచాప! విగతప్రకటాఖిలపాప లింగ త త్త్వప్రద! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
3 |
| ఉ. |
భక్తిరసాభిషిక్త! భవపాశవితాన విముక్త! జంగమా సక్త! దయాభిషిక్త! తనుసంగతసౌఖ్యవిరక్త! సంతతో ద్యుక్త గుణానురక్త! పరితోషితభక్త! శివైక్యయుక్త! ప్ర వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
4 |
| ఉ. |
శత్రు లతాలవిత్ర! గుణజైత్ర! భవాబ్ధివహిత్ర! జంగమ క్షేత్రవిచిత్ర! సూత్ర బుధగీత చరిత్ర! శిలాదపుత్ర! స త్పాత్ర! విశుద్ధగాత్ర! శివభక్తి కళత్ర! శరణ్యమయ్య! భా స్వత్త్రిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
5 |
| ఉ. |
త్ర్యక్షసదృక్ష! సంచితదయాక్ష! శివాత్మక దీక్ష! సత్ప్రసా దాక్ష! ప్రతాప శిక్షిత మహాప్రతిపక్ష! మహోక్ష! భూరి క ర్మక్షయదక్ష! జంగమ సమక్షమ భక్తిపరోక్ష! లింగ త త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
6 |
| ఉ. |
అక్షయభక్తిపక్ష! బసవాక్షర పాఠక కల్పవృక్ష! రు ద్రాక్ష విభూతిపక్ష! ఫలితార్థ ముముక్ష! శివప్రయుక్త ఫా లాక్ష! కృపాసమంచిత కటాక్ష! శుభాశుభ పాశమోక్ష! త త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
7 |
| ఉ. |
ఆర్య వితానవర్య! భువనాదిక శౌర్య! యుదాత్త సత్పదా చార్య! యవార్యవీర్య! బుధసన్నుతచర్య! విశేష భక్తి తా త్పర్య! వివేకధుర్య! పరిపాలితతుర్య! శరణ్యమయ్య! దు ర్వార్య యనూన ధైర్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
8 |
| ఉ. |
తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమథానుగతజ్ఞ! నమ్ర దై వజ్ఞ! కళావిధిజ్ఞ! బలవచ్ఛివభక్తి మనోజ్ఞ! ధూతశా స్త్రజ్ఞ! సువాదపూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ! స ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
9 |
| ఉ. |
క్షీణజనప్రమాణ! యసికృత్త కుయంత్రక ఘోణ! జంగమ ప్రాణ! వినిర్జిత ప్రసవబాణ! సమంచిత భక్తియోగ సం త్రాణ! కళాప్రవీణ! శివధర్మ రహస్యధురీణ! దత్తని ర్వాణ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
10 |