| శతకములు | వృషాధిప శతకము |
|
| ఉ. |
ఉద్ధతభక్తవృద్ధ! వినుతోత్తమ సిద్ధపరీత జంగమ శ్రద్ధ! సదాత్మశుద్ధ! గుణరాజిసమృద్ధ! విముక్తపాశస న్నద్ధ! మహాప్రసిద్ధ యగుణ త్రయబద్ధ! శరణ్యమయ్య! భా స్వద్ధత చిత్ప్రబుద్ధ! బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
31 |
| ఉ. |
నందితభక్తబృంద! యవినాశిరదాంశు ముఖారవింద! సా నంద వినీతికంద! కరుణామకరంద! రసోపలాలిత స్కంద! యుదాత్త భక్తి తరుకంద! యశోజితకుంద! నాకరా డ్వందిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
32 |
| ఉ. |
లౌల్యపరాయణాత్మ గుణలౌల్య! యమూల్య సదోపయుక్త ని ర్మాల్య! వినీతికల్య! యసమానదయా రసకుల్య! నిత్యనై ర్మల్య! యమూల్య! దుష్టజనమానసశల్య! పదాబ్జలబ్ధ కై వల్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
33 |
| చ. |
గురుపద సద్మ సద్మ! యవికుంఠిత జంగమశీలఖేల! సు స్థిర మృదుపాదమోద! సముదీర్ణ విశేషమహత్వ తత్త్వ! ని ర్భర భుజశౌర్య ధుర్య! పరిరంభితభక్తి కళత్ర గోత్ర! మ ద్వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
34 |
| చ. |
భువన హితార్థ తీర్థ! భవభూరుహ శాతకుఠారధార! గౌ రవ సముదాత్తవృత్త! యనురాగ రసామృతసారపూర! శాం భవమయ వేదబోధ! శివభక్తహృదబ్జ వికాసభాస! దే వ వరద కావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
35 |
| చ. |
వినుత నవీనగాన గుణవిశ్రుత భక్తవిధేయకాయ! య త్యనుపమగణ్యపుణ్య నయనాంచలదూర భవోపతాప! స ద్వినయ వికాసభాస సముదీర్ణ శివైక సుఖైకపాక! దే వ నను భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
36 |
| ఉ. |
అంచిత భక్తియుక్త! యసహాయ విశృంఖల వీరపూర! ని శ్చంచలశైవభావ! శ్రిత జంగమపాదకిరీట కూట! హృ త్సంచిత సత్త్వ తత్త్వ! దురితవ్రజశైలకదంబశంబ! ని ర్వంచక నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
37 |
| ఉ. |
నిర్గతధర్మ కర్మ! యవినీత పునర్చవ యంత్ర తంత్ర! దు ర్మార్గ విహీనయాన! గుణమాన్య మహావృషసామ్య! సౌమష డ్వర్గ విరక్త శక్త! మదడంబర వర్జిత వేషభూష! నీ వర్గమునేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
38 |
| చ. |
సరసవచస్క! నిర్మలయశస్క! శివైక్యమనస్క! భక్తహృ త్సరసిజగేహ! క్లుప్తభవదాహ! దయాపరివాహ! చిత్సుఖో త్తర నిజశిల్ప! భక్తపరతల్ప! మహావృషకల్ప! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
39 |
| చ. |
హర సమసౌఖ్య! యాదివృషభాఖ్య! పురాతనముఖ్య తత్త్వవి త్పరిషదుపాస్య! వీతగుణదాస్య! త్రిలోకసమస్య! తార్కికో త్కర జయశౌండ! దీర్ఘభుజదండ! మహాగుణషండ! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
40 |