| శతకములు | కుమార శతకము |
|
| క. |
మర్మము పరులకుఁ దెలుపకుఁ దుర్మార్గున చెంత నెపుడు దూరకు, మిల దు ష్కర్మములఁ జేయ నొల్లకు, నిర్మలమతి నుంట లెస్స నిజము కుమారా! |
101 |
| క. |
సారమతి నిటుల తిరిగెడి పూరుషరత్నంబు కీర్తిఁ బొందుచు ధరపై గోరినకోర్కె ఫలము శ్రీ మీఱ ననుభవించుచుండు మిగులఁ గుమారా! |
102 |
| క. |
ఇల ఫక్కికులోద్భవుఁడ ప్పల నరసింహాఖ్యుఁ డిట్టి పద్ధతులు ధరం గల బాలుర కెల్ల గుణం బులు కలుగఁగ వెలయఁజెప్పె బుద్ధి కుమారా! |
103 |
| క. |
పదునెనిమిదివందల యఱు వది యగు క్రీస్తుశకమందు వరరౌద్రిని మే లొదవ రచింపబడె ని య్యది బాలురకొఱకుఁ బౌష మందుఁ గుమారా! |
104 |