శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. నరవరుఁడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్‌
సరిగా మెలంగ నేర్చిన
పురుషుఁడు లోకమునఁగీర్తి బొందుఁ గుమారా!
11
క. పుడమిని దుష్టత గలయా
తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడి యౌ
నడవడి విడి యందఱి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు పఱప బుత్రా!
12
క. పనులెన్ని కలిగి యున్నను
దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై
వినఁగోరుము సత్కథలను
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!
13
క. ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁ దలఁపుఁ గుమారా!
14
క. సదమల మతితోఁ బెద్దల
మది కింపుగ మెలఁగు, నింద మానుము పరులన్‌
మృదు మార్గములను వదలకు
విదితంబుగ దానఁగీర్తి వెలయుఁ గుమారా!
15
క. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిజేయకు
మాచారము విడువఁబోకుమయ్య! కుమారా!
16
క. పుట్టినది మొదలు పరసతి
బఁట్టగ జూచుటయు నింద పద్ధతి యనుచు
న్నట్టి పురుషుఁడు పుడమిం
బుట్టిన జనతతులఁ గీర్తిఁ బొందుఁ గుమారా!
17
క. కల్లలగుమాట లాడక
యెల్ల జనంబులకు వేగ హృదయము కడు రం
జిల్లఁగఁ బల్కుము నీ కది
తెల్లమి రహిఁ గీర్తిఁ గాంచు తెఱఁగు కుమారా!
18
క. ఏనాఁడైనను వినయము
మానకుమీ, మత్సరమున మనుజేశులతోఁ
బూనకు మసమ్మతము, బహు
మానమును బొందు మిదియె మతము కుమారా!
19
క. నగఁగూడదు పరసతిఁ గనఁ
దగు మాతృసమాన మెన్నఁ దగు నెవ్వరితోఁ
బగ గూడదొరుల నిందిం
పగఁగూడదు గనుము వృద్ధ పథము కుమారా!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )