| శతకములు | కుమార శతకము |
|
| క. |
ఘన బీజము సాయము లే కను భూములు నిష్ప్రయోజకంబైన విధం బున దైవము తోడిలఁగా కనె పౌరుష కర్మఫలము గలదె కుమారా? |
81 |
| క. |
ధరనే వస్తువులైనన్ దరుగుటకై వృద్ధినొందుఁ దగఁ బొడ వెదుగున్ విరుగుటకై, పాయుటకై దరిఁ జేరును, వీని మదిని దలఁపు కుమార! |
82 |
| క. |
జనియించుట పొలియుటకే పెను సుఖమొందు టది కష్ట విధి నొందుటకే విను హెచ్చుట తగ్గుటకే యని మనమున నమ్మవలయు నయ్య! కుమారా! |
83 |
| క. |
ఎటువంటి వరకులంబునఁ బటుతరముగఁ బుట్టెనేని పరఁగఁగ మును గ న్నటువంటి కర్మఫలములఁ గటగట! భోగింపవలయుఁ గాదె? కుమారా! |
84 |
| క. |
పెక్కుజనులు నిద్రింపఁగ నొక్కండయ్యెడను నిద్ర నొందకయున్నన్ గ్రక్కున నుపద్రవం బగు నక్కర్మమునందుఁ జొరకు మయ్య! కుమారా! |
85 |
| క. |
మధురంబులఁ గొననొల్లఁడు బుధజనుఁ డేకతమ దారిఁ బోనొల్లఁడు నీ విధ మెఱిఁగి నీవును మనో రథ సిద్ధుఁడవగుచు మెలఁగ రాదె! కుమారా! |
86 |
| క. |
ధనవంతుఁడె కులవంతుఁడు ధనవంతుఁడె సుందరుండు, ధనవంతుండే ఘనవంతుఁడు బలవంతుఁడు ధనవంతుఁడె ధీరుఁడనుచుఁ దలఁపు కుమారా! |
87 |
| క. |
విను ప్రాణరక్షణమునన్ ధనమంతయు మునిగిఁపోవు తఱిఁ బరిణయమం దున గురుకార్యమున వధూ జన సంఘములందు బొంకఁ జనును గుమారా! |
88 |
| క. |
కులభామల విడువకు, వెలి పొలఁతుల వీక్షించి మోహమునఁ బొరలకుమీ ఖలుఁ డందు రెట్టివారలుఁ గులహీనుఁడు పుట్టెననుట కొఱలుఁ గుమారా! |
89 |
| క. |
చపలాత్ముఁ డవనిలోపల నపాత్ర జనులకును దాన మందిచ్చుట హి నపుఁ గుక్క నోటిలోపల నిపుణత నెయిపోసినట్లు నెగడుఁ గుమారా! |
90 |