శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
ఉ. కుంకుమకస్తురీ ప్రభ బుగుల్కొనఁ జెక్కుల జాఱ దివ్యతా
టంకమణిప్రభాప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ
జంకెల నందలింపఁగనె జల్లనెఁ జిత్తము నీకు నంతలో
నంకన మించు మిమ్ముఁ బులకాంకురకోటులు వేంకటేశ్వరా!
21
ఉ. కస్తురి పచ్చకప్పురముఁ గమ్మనిపుప్పొడి ధూళ్లు హత్తి శ్రీ
హస్తమునందుఁ దట్టిపునుఁగందుచు శ్రీయలమేలుమంగ భా
రస్తనవైభవంబులఁ గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ
కౌస్తుభరత్న సౌధమునఁ గౌఁగిటిపాన్పున వేంకటేశ్వరా!
22
ఉ. అందవు కోసి యిమ్ము విరు లంచును జే రలమేలుమంగ ని
న్నందగఁగోరఁ జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న
య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచుఁ బువ్వులు కోయఁజేయ ని
ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా!
23
ఉ. ఒక్కొకనాఁటి రాత్రి సకలోన్నతుఁడైన ఖగేంద్ర మూర్తిపై
నెక్కి వినోదలీలఁ జరియించుచు నయ్యలమేలుమంగ మో
మక్కునఁ జేర్చుచు\న్‌ బహువిహారముల\న్‌ వనవీథులంబ్రియం
బెక్కువగాఁ జెలంగువిధ మే మని చెప్పుదు వేంకటేశ్వరా!
24
ఉ. దుగ్ధపయోధికన్య జలధుల్‌ జగముల్‌ దనకుక్షినున్న సు
స్నిగ్ధకృశోదరాంగి తులసిం బ్రియురాలలమేలుమంగ యీ
... ... ... ... ... ... నుచు నిన్ను మునీంద్ర కన్యకల్‌
దిగ్ధరణీధరంబుల నుతింతురు నవ్వుచు వేంకటేశ్వరా!
25
ఉ. పాయని జాజిపువ్వులనె పట్టుక బాయు ... ... ...
... ... ... రాహుతుఁడవైనపు డాయల మేలుమంగ ని
శ్శ్రేయసలక్ష్మి నీశరము చెంగట నొప్పెఁ దురుష్క దేశబి
బ్బీయెలపువ్వు పయ్యెదనె ప్రేమపునవ్వున వేంకటేశ్వరా!
26
ఉ. ఓచెలి! యోలతాప్రతిమ! యోమృగలోచ! యోచకోరిరో!
యోచదురాల! యోచిలుక! యో ... ... ... యలమేలుమంగ నీ
చూచినచూపులే విభుఁడు చూచినచూపు లటంచు నీసతిన్‌
ఖేచరసిద్ధకామినులు కీర్తనసేతురు వేంకటేశ్వరా!
27
ఉ. మంగళ మమ్మకున్‌ సకల మంగళ మంబుజ నేత్రకున్‌ జయా
మంగళ మిందిరాసతికి మంగళ మీయలమేలుమంగకున్‌
మంగళమందు నే మఱియు మంగళమందును దేవలోక ది
వ్యాంగన లెల్ల నీసతికి నారతు లిత్తురు వేంకటేశ్వరా!
28
ఉ. వెలదిఁ మహాపరాధములు వేయును జేసితిఁ గావుమన్న నీ
పులకలు మేనిఘాతలును బూఁతలు జూ చలమేలుమంగ నీ
యలకలు దీర్చి చెక్కు చెమ టల్లన గోళ్లను జిమ్మి పయ్యెదన్‌
బలుచనినవ్వుతో విసరుఁ బై చెమ టారఁగ వేంకటేశ్వరా!
29
ఉ. ఏచతురత్వ మేమహిమ మేమి విలాస మదేమి విభ్రమం
బీ చెలువంపు సంపదయు నిందుముఖుల్‌ జగదేకమోహినుల్‌
చూచి తలంట వేడ్కపడి చూతురు నీయలమేలుమంగ లీ
లాచికురంపుఁ గ్రుమ్ముడి కెలంకుల నిగ్గులు వేంకటేశ్వరా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )