| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| చ. |
తగు నలమేలుమంగకును దన్మయమందెడునీకు మేనిలో బగటులు బచ్చిమాటలను బచ్చెనయెచ్చరికల్ వివేకముల్ మొగముల లేఁతనవ్వులను మోవులనాటులుతమ్మితూటులు\న్ జగడపుఁబొందులు\న్ రతులసంపదవిందులు వేంకటేశ్వరా! |
71 |
| చ. |
సరి నలమేలుమంగకును జక్కనిమీకును మీకుమీకు లో నరుదుగ నేకతస్ఫురణ నమ్ముడు వోయితి రొక్కరొక్కరు\న్ ఇరువురు నింక నేటితెలి వెక్కడినేరుపు లేటిసైరణల్ గిరపులపుచ్చె మేనఁ బులకింతలు వింతలు వేంకటేశ్వరా! |
72 |
| చ. |
ఒకయలమేలుమంగ మహిమోన్నతిఁ జిక్కితి యోగలీలచేఁ జికురభరంబు జాఱ నలసె\న్ నిఖిలోన్నతుఁ డంచు నీకృప\న్ బ్రకటములైన కాంత ... ... యింతురు శీతల క్రియ\న్ మొకముల నిగ్గు దేఱఁగను ముచ్చటలాడుచు వేంకటేశ్వరా! |
73 |
| చ. |
నగ వలమేలుమంగకును నాటవవల్కలు నీకు మాటల\న్ బగ డలమేలుమంగకును బచ్చెనగర్వము నీకుఁ జూపుల\న్ జిగి యలమేలుమంగకును శ్రీమల వేడుక నీకు నిట్ల పో మిగిలిన మోహసంపదలు మీరును మీరును వేంకటేశ్వరా! |
74 |
| ఉ. |
ఈయలమేలుమంగ మణిహేమకటీరశనాకలాపముల్ రాయఁగఁ రాలుఁ బైఁడిపొడి రంతులు మీఱినవజ్రపుంబొడి\న్ శ్రీయలరారుకొప్పునఁ బ్రసిద్ధిగ రాలెడు కమ్మపుప్పొడి\న్ నీయనుఁగుంగవుంగిటికి నిచ్చె వసంతము వేంకటేశ్వరా! |
75 |
| ఉ. |
ఓయలమేలుమంగ యిది యొక్కటిపో జగదేక భర్తకు\న్ బాయనినీకునుం గడమ ప్రాణము ప్రాణము నేకమాయె నీ కాయము కాయముం గలసెఁ గౌఁగిటకాంక్ష యటంచు నీసతి\న్ బ్రాయము నిండుజవ్వనముఁ బల్మఱు మెత్తురు వేంకటేశ్వరా! |
76 |
| చ. |
ఇతఁ డలమేలుమంగ విభుఁ డీతఁడెవో కలశాబ్ధికన్యకు\న్ సతతముఁ జిత్త మిచ్చిన రసజ్ఞుఁడు ప్రాజ్ఞుఁడు సర్వవైభవో న్నతుఁడు రమాసతీ ప్రియుఁడు నందకశార్ఙ్గధరుం డటంచు ని న్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడుదు రెప్పుడు వేంకటేశ్వరా! |
77 |
| ఉ. |
మాయలమేలుమంగ చలమా యలయించెద వెంతసేసిన\న్ దోయజగంధి నీకు మతితోడనె తక్కిన దల్క నోపు నా చేయఁగ నేర్చుచేఁత లివె చేయుదుగాక లతాంతసాయకుం డీయెడఁ జేయు వేదన లకిన్నియుఁ దోడుగ వేంకటేశ్వరా! |
78 |
| చ. |
మతి నలమేలుమంగకును మంతనమాడెడు నీవిలాసముల్ తతిఁ దలపోఁతలై సురతతాండవసంభ్రమలీలలై సమం చిత సరసప్రసంగములు చిమ్మనిదొంతరలై ప్రియంబులై వితతమనోజవిద్యల నవీనము లైనవి వేంకటేశ్వరా! |
79 |
| చ. |
కసిగలచూపు చిమ్ముదును కంకణహస్తము సాఁచి కుంచెచే విసరకు రమ్మనంగ వడి వెన్నెలమోమున ముద్దుగుల్కెడి\న్ రసికున కంచుఁ జక్కనిపురంధ్రిని నీయలమేలుమంగతో ముసిముసినవ్వు నవ్వుదురు ముచ్చటలాడుచు వేంకటేశ్వరా! |
80 |