| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| చ. |
పరిమళమో కదంబమొ ప్రభల్ విడ నించిననిగ్గొ నిర్మలా భరణమొ నిత్యవైభవమొ భాగ్యమొ శ్రీయలమేలుమంగ భూ ధరునకు నాదిలక్ష్మి యని తత్త్వమహత్త్వ రహస్యవేత్తలం బరమున నుండి నీవనితఁ బ్రస్తుతి సేతురు వేంకటేశ్వరా! |
31 |
| చ. |
తిరుమగు మంచి కుందనపుఁ దీగపయిన్ ఘనచక్రవాకముల్ పరగినరీతిఁ జన్నుఁగవ భావముతో నలమేలుమంగ నీ యురముపయిం జెలంగఁగని యోగిజనంబులు నీలమేఘవి స్ఫురణముతోడి మిం చనుచుఁ జూచి నుతింతురు వేంకటేశ్వరా! |
32 |
| చ. |
కొలఁదికిమీఱుఁ గ్రొవ్విరులు కొప్పునఁ జాఱఁగఁ జూపుకన్నుల\న్ గులుకుచు నుండ నెన్నుదుటికుంకుమతో నలమేలుమంగ వె న్నెలనునుఁదీఁగయై కళలునించినఁపుత్తడి బొమ్మయై నినుం గలికి కరంబునం జెనయఁగంటిరిగా తమి వేంకటేశ్వరా! |
33 |
| చ. |
పెడమర చూచి చూపు జళిపించిన నెట్లు ధరింతువో ప్రియం బడరఁగఁ గౌనుదీగ నులియన్ ... ... ... ... ... నన్ సడివడి యెంతవేఁగుదువొ చక్కని శ్రీయలమేలుమంగ నీ వెడవగు మోముఁజూచి నగి వెన్నెల చల్లిన వేంకటేశ్వరా! |
34 |
| ఉ. |
... ... ... ... ... గుజ్జెన గూళ్ళును బైఁడిపొళ్ళు మా యమ్మకు బొమ్మరిళ్లు లలితాంగికి మాయలమేలుమంగకున్ బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు లటంచు నీసతిన్ నెమ్మి భజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా! |
35 |
| ఉ. |
ఓ కమనీయకంజముఖి! యోవలరాయనితల్లి! యోసుధా సైకతచాతురీజఘన చక్రిణి! యోయలమేలుమంగ! నీ వే కరుణించి కావుమని వేడ్కల నింద్రపురంధ్రు లందఱున్ బైకొని నీలతాప్రతిమ బ్రస్తుతిసేతురు వేంకటేశ్వరా! |
36 |
| ఉ. |
జాగరమేల చేసెదవు చంద్రనిభానన పవ్వళింపు నీ భోగపరిశ్రమంబులకు భూషణమై యలమేలుమంగ నీ యోగవియోగలీల లని యోగికన్యలు నీవధూటి నా యాగతి బుజ్జగింతురు మహావినయంబున వేంకటేశ్వరా! |
37 |
| ఉ. |
పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచ మంతకున్ దల్లి సమస్తజీవులనిధానమ శ్రీయలమేలుమంగ నీ చల్లనిచూపు చిల్కి వెదచల్లఁగఁ బుణ్యులమైతి మండ్రు భూ మెల్లను నీ వధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా! |
38 |
| చ. |
చెఱఁ గిడఁగా నదల్చెదవు చేరినఁ దిట్టెదు కౌఁగిలించినన్ గొఱఁతలె యెన్నఁజూచెదవు కోపము న ద్దలమేలుమంగ నా వెఱ పిఁకనైనఁ దీర్పుమని వేడ్కల నీవు మనోజలీలలన్ దఱితఱి నింతిఁ గూడుటలుఁ దత్తఱపాటులు వేంకటేశ్వరా! |
39 |
| ఉ. |
రాపుగ మమ్ము నేయునపరాధశతంబుల సంతముల్ సదా ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... కాపురమున్ నిరంతము గల్కితనంబును వేంకటేశ్వరా! |
40 |