| శతకములు | వేంకటేశ్వర శతకము |
|
| శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య | ||
| చ. |
తుఱు మఱవీడెఁ బయ్యెదయుఁ దోడనె జాఱె మెఱుంగు ఱెప్పల\న్ బరవశభావ మేర్పడియెఁ బాయక నీ వలమేలుమంగ నీ వరునిఁ దలంచితో యనుచు వాసనమేనుల దేవ కామినుల్ సరగున నీలతాంగి కుపచారము సేతురు వేంకటేశ్వరా! |
91 |
| ఉ. |
రాజసలీల నన్నును గరంబునఁ బట్టకు చూప వేల నీ తేజము నాకటంచు సుదతీమణి శ్రీయలమేలుమంగ ని న్నీ జగదేకనాయకుని నింపొలయించుచు సారెసారెకు\న్ జాజులకొప్పువీడ సరసంబున వీచును వేంకటేశ్వరా! |
92 |
| ఉ. |
చక్కదనంబు రాశి నునుసానల\న్ బట్టినపువ్వుటమ్ములోఁ జక్కెర నించి చేసిన రసస్థితి శ్రీయలమేలుమంగ నీ మక్కువఁ జిక్కి మాతలభ్రమం దగులై కలవంత నిట్ల నీ వక్కుఁనఁ జేర్పఁగా నలరె నన్నువ కౌఁగిట వేంకటేశ్వరా! |
93 |
| ఉ. |
మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్ కానిక లిచ్చినాఁడవట కౌఁగిట నాయలమేలుమంగకు\న్ మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబునఁ గౌఁగిలించి నీ పానుపుమీఁది చేఁత లివి పచ్చితలంపులు వేంకటేశ్వరా! |
94 |
| చ. |
ధళధళ మించు కన్నుఁగవ తమ్ముల మిమ్ములఁ జూపు చిమ్మిన\న్ గళవళమందకుండుదురె గ్రక్కున శ్రీయలమేలుమంగకు\న్ సళువుల నవ్వుఁ గొంత నునుసోనలగర్వముఁ గొంతనవ్వుఁగా కెలపులఁ గొంతకొంత పులకింతలు వింతలు వేంకటేశ్వరా! |
95 |
| ఉ. |
దర్పక రాజ్యసంపదలు తన్మయకోటులు రాగిలోకసం తర్పణముల్ లతాధరసుధాపరిధానము లాననవ్రతుల్ కర్పురగంధసౌఖ్యములు గ్రక్కున శ్రీయలమేలుమంగకు\న్ మార్పడు దేహసంగతుల మర్మిపుఁజేతలు వేంకటేశ్వరా! |
96 |
| ఉ. |
అంబరమెల్లఁ జంద్రమయ మైనటులామదనాంకముల్ మెయి\న్ బంబిన నేడ వంచు సిరి పల్కిన నయ్యలమేలుమంగ పా దంబుల యానవెట్టితివి తమ్మియిగుళ్లని నీకు బొంకులే నెంబళమాయె నెవ్వరికిఁ జెల్లవు రంతులు వేంకటేశ్వరా! |
97 |
| చ. |
చెఱఁగులు చూపి క్రొవ్విరులు చిందెడు తేనెలు నాల్గువంకల\న్ వఱదలువాఱె ఘర్మములు వాహినులై యలమేలుమంగతోఁ గఱఁగుచు నీవు కౌఁగిట సుఖస్థితిఁ గూడుచు బంధుసంగతి\న్ దెఱ దిగనేసి వేడుకలు తెప్పలఁ దేలఁగ వేంకటేశ్వరా! |
98 |
| ఉ. |
వాలికనేత్రపద్మములు వంచినయావదనంబు పద్మినీ పాల జనింపనందుననె పద్మినియై యలమేలుమంగ గో పాలకచక్రవర్తి నినుఁ బాయనికౌఁగిట భోగలీలఁ బాం చాలునిఁ జేసె పుష్పశరశాస్త్రవిదగ్ధుని వేంకటేశ్వరా! |
99 |
| ఉ. |
అమ్మకుఁ దాళ్లపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబుఁ జెప్పెఁగో కొమ్మని వాక్ప్రసూనములఁ గూరిమితో నలమేలుమంగకు\న్ నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మది మంది వర్ధిలను జవ్వన లీలల వేంకటేశ్వరా! |
100 |