| శతకములు | శ్రీ కాళహస్తీశ్వర శతకము |
|
| శా. |
ఏలీలన్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్యశ బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణించుచో, చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వరా! |
51 |
| శా. |
పాలుంబువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా! యన్న లే లే లెమ్మన నరంటిపండ్లుఁగొని తేలేకున్న నే నొల్లనం టే లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీ లీలావచనంబులం గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా! |
52 |
| మ. |
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం బులటంచుం దెవులంచు దిష్టియనుచు న్భూతంబులంచున్విషా దులటంచు న్నిమిషార్ధజీవనములందుం బ్రీతిఁబుట్టించి యీ సిలుగుల్ ప్రాణుల కెన్నిచేసితివయా శ్రీకాళహస్తీశ్వరా! |
53 |
| మ. |
తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్గంధప్రసారంబు లో పల నైవేద్యముఁజేర్చు నే మనుజుఁడాభక్తుండు నీ కెప్పుడుం జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా! |
54 |
| శా. |
ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు నిశ్టార్థంబు లీనేర్తు రే వేళ న్వారిభజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీ లెవ్వారికిఁ గూడఁబెట్టెదవయా శ్రీకాళహస్తీశ్వరా! |
55 |
| మ. |
సులభుల్మూర్ఖు లనుత్తమోత్తములు రాజుల్గల్గి యేవేళన న్నలఁతం బెట్టిన నీ పదాబ్జములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలుటంబునిధిలోఁ గాపుండుటబ్జంబుపైఁ జెలువొప్పన్సుఖియింపఁ గాంచుటసుమీ శ్రీకాళహస్తీశ్వరా! |
56 |
| మ. |
కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్బున్నయుం, బులిలోలున్భసితంబుఁ బాపతొడవుల్పోకుండఁ దోఁబుట్లకై, తొలినేవారలతోడఁబుట్టగఁ గళాదుల్గల్గె మేలయ్యె నా సిలువుల్దూరము చేసికొంటెఱిగియే శ్రీకాళహస్తీశ్వరా! |
57 |
| మ. |
శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్శోధించి తత్త్వంబులన్ మతినూహించి శరీరమస్థిరము బ్రహ్మంబెన్నసత్యంబు గాం చితిమంచున్ సభలన్ వృథావచనముల్చెప్పంగనేకాని, ని ర్జిత చిత్తస్థిరసౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా! |
58 |
| మ. |
గతినీవంచు భజించువార లపవర్గంబొందఁగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా "యాయురన్నం ప్రయ చ్ఛతి" యంచున్మొఱవెట్టఁగా శ్రుతులు సంసారాంధకారాభిదూ శిత దుర్మార్గులు గానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా! |
59 |
| మ. |
రతిరాజుద్ధతి మీఱనొక్క మఱి గోరాజాశ్వునిన్ నొక్కఁబో నతఁడా దర్పకు వేగ నొత్తఁ గవయం బాఁబోతునుందాఁకి యు గ్రతఁ బోరాడఁగ నున్న యన్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టినన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా! |
60 |