| శతకములు | శ్రీ కాళహస్తీశ్వర శతకము |
|
| శా. |
కేదారాదిసమస్త తీర్థములు కోర్కింజూడఁ బోనేఁటికిం గాదా ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు మీ పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల క్ష్మీదారిద్ర్యులుగారె లోకు లకటా! శ్రీకాళహస్తీశ్వరా! |
81 |
| మ. |
తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్యపా శములంబట్టి బిగించి నీదు చరణస్తంభంబున\న్ గట్టివై చి ముదంబెప్పుడుఁ గల్గజేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా! |
82 |
| శా. |
వేధం దిట్టఁగరాదు గాని భువిలో విద్వాంసులం జేయనే లా ధీచాతురిఁ జేసిఁ జేసిన గులామాపాటునే పోక క్షు ద్బాధాదుల్ కలిగింపనేల యదికృత్యంబైన దుర్మార్గులన్ ఛీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీకాళహస్తీశ్వరా! |
83 |
| మ. |
పుడమిన్నిన్నొక బిల్వపత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులుం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్లునుం బెట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదురకటా! శ్రీకాళహస్తీశ్వరా! |
84 |
| శా. |
విత్తజ్ఞానము పాడుచిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్త్వంబు తదంకురం బనృతముల్ మాఱాకులత్యంత దు ర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులుం జిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వరా! |
85 |
| శా. |
నీపై గావ్యము చెప్పుచున్నయతఁడు న్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంబొనరింతు నన్నయతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తింబఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్‌గాక చీ చీ పృశ్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా! |
86 |
| శా. |
సంపద్వర్గముఁ బాఱఁదోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకముల్నఱికి బంధక్లేశ దోషంబులం జింపుల్చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా? శ్రీకాళహస్తీశ్వరా! |
87 |
| శా. |
రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరఁగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయఁగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో మానవు ల్బాపరా జీజాతాది మదాంధ బుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వరా! |
88 |
| శా. |
నిన్నం జూడరొ మొన్నఁజూడరో జనుల్ నిత్యంబుఁజావంగ నా పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గందురిక మర్త్యుల్ గొల్వరేమో నిను న్చిన్నంబుచ్చక ప్రోవకుండునెడలన్ శ్రీకాళహస్తీశ్వరా! |
89 |
| శా. |
వన్నేయేనుఁగు తోలుదుప్పటము బువ్వా కాలకూటంబు చే గిన్నే కపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే ల్నిన్నీలాగున నుంటయుందెలిసియు న్నీపాదపద్మంబు చే ర్చెన్నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా! |
90 |