| శతకములు | కుప్పుసామి శతకము |
|
|
కైతకైదువన్న భీతిపడు జగంబు కైదు వున్నయట్లె కవితయున్నఁ గవుల నాశ్రయించి కడచన్నరాజులు గొప్పవారలైరి కుప్పుసామి. |
101 |
|
కఱద లిన్నికూర్చి కవిరాజు వచియించెఁ బరులకొఱకుఁ గార్య పరులకొఱకుఁ జిక్కువచ్చినపుడు చిక్కుదీరును దీని విప్పి చదువుకొన్నఁ కుప్పుసామి. |
102 |