| శతకములు | కుప్పుసామి శతకము |
|
|
వయసు చెల్లుచున్నంత లావణ్యముడుగు నుడుగనిది యొక్క శీలంబు పడతికెప్పు డుడుగకుండంగ వర్ధిల్లు చుండుఁ గాన గుణములేని చెలువయేల కుప్పుసామి. |
91 |
|
తలలు మాడుచున్నఁ దమపాదములఁ బట్టి కొన్నవారి కిచ్చు గొప్పనీడ పాదపంబు లిట్లె పండితు లిత్తురు కోర్కె లాశ్రితులకుఁ కుప్పుసామి. |
92 |
|
దేహపాటవంబు దిగజారు కొలఁదిని విషయవాంఛ మిగులఁ బెఱుగుచుండు నందుచేత దేహ మారోగ్యమున నుంచి కొనుట మేలు ప్రజకుఁ గుప్పుసామి. |
93 |
|
పాడిపంటలేక పశుసంపదయు లేక కాయకష్టము పడు కడిమిలేక బ్రదుకుచుండునట్టి రైతుబిడ్డల నమ్మఁ గూడదెపుడు సుంత కుప్పుసామి. |
94 |
|
మేనమామ పోల్కి మేనత్త చాలిక యనెడి సంప్రదాయ మధిగమించి పెండ్లిచేయునపుడు పెద్దగా యోజించి కులము నెమకవలయుఁ కుప్పుసామి. |
95 |
|
కానిడబ్బు చేతఁ గల్గువాఁ డెట్టివాఁ డయిన గౌరవంబు నందుటెఱిఁగి పరువుఁగోరి బ్రదుకు వాఁడెందు ద్రవ్యంబుఁ గూడఁ బెట్టవలయుఁ గుప్పుసామి. |
96 |
|
చిడిపిరాళ్ళగనిని బొడఁగట్టు వజ్ర మొ క్కొక్కమాటు గాన నోర్మిగల్గి వెదకి వెదకి చాల వెడవంగడమునుండి కొనఁగవచ్చుఁబిల్లఁ గుప్పుసామి. |
97 |
|
పెట్టుపోతలున్న యట్టి వంగస మెందుఁ గుతిలపడదు ధనము కొఱఁతఁబడినఁ గానఁ బెట్టుపోత లానుగా జరుపుట కూర్చుచుండు మేలు కుప్పుసామి. |
98 |
|
జంతుజాలమునకుఁ జావు నైజమగుటఁ దెలివి గల్గువారు దెలిసికొనుచు దానధర్మములను దనివోవఁ జేతురు కూర్చు శుభము దానఁ కుప్పుసామి. |
99 |
|
తల్లి కప్పిపుచ్చుఁ దనబిడ్డలందున్న యెన్ని దప్పులైన నెట్టివైనఁ దలకుఁ జుట్టుగుడ్డ తనకున్న చిఱుగులఁ గప్పిపుచ్చునట్లు కుప్పుసామి. |
100 |