| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
తపముల్ మంత్రసమస్తయజ్ఞఫలముల్ దానక్రియారంభముల్ జపముల్ పుణ్యసుతీర్థసేవఫలముల్ సద్వేదవిజ్ఞానము\న్ ఉపవాసవ్రతశీలకర్మఫలముల్ ఒప్పార నిన్నాత్మలో నుపమింపం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా! |
101 |
| శా. |
శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడు\న్ నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా! |
102 |
| మ. |
కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్యసంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబున\న్ అలర న్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహంబు దా వెలయ\న్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా! |
103 |
| మ. |
రమణీయంబుగ నాదిమంబు నవతారంబు\న్ భవద్దివ్యరూ పము నామామృతము\న్ దలంప దశకప్రా ప్తయ్యెఁ గృష్ణావతా రము సుజ్ఞానము మోక్షము\న్ ద్వివిధసంప్రాప్తి\న్ శతాంధ్రాఖ్య కా వ్యము నర్పించితి మీపదాబ్జములకు\న్ వైకుంఠ నారాయణా! |
104 |
| శా. |
నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుది\న్ నీ పాద నిర్మాల్యని ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్ నీమం బొప్ప భజింప నీజపము వర్ణింప\న్ గృపం జేయవే శ్రీ మించ\న్ బహుజన్మ జన్మములకు\న్ శ్రీయాదినారాయణా! |
105 |