| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
ఇరవొంద\న్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా కరయ\న్ పద్మభవాండ భాండచయము న్నారంగ మీకుక్షిలో నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం తర వాఃపూరము చంద మొంది యెపుడున్ దైత్యారి నారాయణా! |
21 |
| మ. |
దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో మల నాభీచరణారవిందజనితామ్నాయాద్యగంగా! లస జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా! |
22 |
| మ. |
జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ! భూ గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా! ప్రదీపప్రయో గి గణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణ సంసేవితా! త్రిగుణాతీత! ముకుంద! నాదు మదిలో దీపింపు, నారాయణా! |
23 |
| శా. |
భూతవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో పేతంబై పరమాత్మవై నిలుతు నీ పెంపెవ్వరుం గాన ర బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ఠ, నారాయణా! |
24 |
| మ. |
వరనాభీధవళాంబుజోదరమున\న్ వాణీశుఁ గల్పించి య ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా! |
25 |
| మ. |
ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా నభవాఖ్యుండవు ని న్నెఱుంగవశమే యబ్జాక్ష, నారాయణా! |
26 |
| మ. |
పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా! |
27 |
| మ. |
సవిశేషోరు సువర్ణబిందువిలస చ్చక్రాంకలింగాకృతి\న్ భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీప్యన్మునీంద్రాళిచే నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా! |
28 |
| మ. |
సర్వంబున్ వసియించు నీతనువునన్ సర్వంబునం దుండగా సర్వాత్మా! వసియించు దీవని మదిన్ సార్థంబుగాఁ జూచి యా గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా! |
29 |
| మ. |
గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండావలిన్ సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా! |
30 |