| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
మగమీనాకృతి వార్ధిఁ జొచ్చి యసురు న్మర్దించి యవ్వేదముల్ మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్ ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా! |
11 |
| మ. |
అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతసామర్థ్యులై భ్రమరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా దమకించె\న్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా! |
12 |
| శా. |
భీమాకారవరాహమై భువనముల్ భీతిల్లి కంపింప ను ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్ హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మి\న్ గారవింపంగ నీ భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా! |
13 |
| శా. |
స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్ దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరు\న్ శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్ శోభిల్ల మన్నించి య జ్జంభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు, నారాయణా! |
14 |
| మ. |
మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్ సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర, నారాయణా! |
15 |
| మ. |
ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై పరగం బైతృక తర్పణంబుకొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్ నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జించి త త్పరశుభ్రాజిత రామనామము కడు\న్ ధన్యంబు, నారాయణా! |
16 |
| మ. |
వరుసం దాటకిఁ జంపి కైశికు మఘ స్వాస్థ్యంబు గావించి శం కరు చాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రిపం పరుదారన్ వనభూమి కేఁగి జగదాహ్లాదంబుగా రావణున్ ధరణిం గూల్చిన రామనామము కడు\న్ ధన్యంబు, నారాయణా! |
17 |
| మ. |
యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్ మదవద్ధేనుక ముష్టికా ద్యసురుల\న్ మర్దించి లీలారసా స్పద కేళీరతి రేవతీవదన కంజాతాంతభృంగం బన\న్ విదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు, నారాయణా! |
18 |
| మ. |
పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రబోధించి య ప్పురముల్ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు, నారాయణా! |
19 |
| మ. |
కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ వలనం గల్క్యవతార మొందఁగల నిన్ వర్ణింతు నారాయణా! |
20 |