| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా! |
81 |
| మ. |
వెలయన్ యౌవనకాలమందు మరుఁడున్ వృద్ధాప్యకాలంబునన్ బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా! |
82 |
| మ. |
బలుకర్మాయత పాశబంధవితతి\న్ బాహాపరిశ్రేణికి\న్ జలయంత్రాన్విత బంధయాతనగతిన్ సంసారకూపంబులో నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్ వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా! |
83 |
| మ. |
మమహంకార వికారసన్నిభ మహామత్తాది లోభాంధకా రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగ\న్ రా దింక నాలోన నీ విమలాపాంగ దయా దివాకరరుచిన్ వెల్గింపు మింపార నో కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష! నారాయణా! |
84 |
| మ. |
పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావుమీ బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా! |
85 |
| మ. |
సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయు\న్ ధ్యానము\న్ ధృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స మ్మతికిం జేరువ మీనివాససుఖమున్ మానాథ నారాయణా! |
86 |
| మ. |
భవనాశి\న్ గయ తుంగభద్ర యమున\న్ భాగీరథిం గృష్ణ వే త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం దవగాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చట\న్ భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా! |
87 |
| మ. |
ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్ పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్ జేసితి\న్ కరుణం జేకొని కావు మయ్య త్రిజగత్కల్యాణ నారాయణా! |
88 |
| మ. |
గణుతింప\న్ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా రణబంధుం డని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగ నే బ్రణతుల్ జేసెదఁ గొంత యైనఁ గణుతింపం బాడి లేకుండినన్ ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా! |
89 |
| మ. |
కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ కరచక్రంబున నక్రకంఠము వెస\న్ ఖండించి మించెం దయా పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా! |
90 |