| శతకములు | నారాయణ శతకము |
|
| మ. |
ఎల రారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నె ట్లోపెడు\న్ కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్ నిలువ న్నేర్చునే భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా! |
31 |
| మ. |
కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్ వెలయ\న్ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబున\న్ జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్ దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠన\న్ దోషఘ్న, నారాయణా! |
32 |
| మ. |
కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయు\న్ వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా! |
33 |
| మ. |
పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్ధోరగయక్ష పక్షిమునిరక్షో హృద్గుహాభ్యంతర స్థిరసుజ్ఞానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై సరి లే కెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు, నారాయణా! |
34 |
| మ. |
అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్ సుధయై వేదవినూత్నరత్నములకున్ సూత్రాభిధానంబునై బుధసందోహమనోహరాంకురమునై భూదేవతాకోటికిన్ విధులై మీబహునామరాజి వెలయున్ వేదాత్మ, నారాయణా! |
35 |
| మ. |
పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దును\న్ ఘనపాపంబుల వైరి షడ్రిపులకు\న్ గాలావసానంబు మీ వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా! |
36 |
| మ. |
భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబింబంబు క ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై భువిలో మీదగు మంత్రరాజ మమరున్ భూతాత్మ, నారాయణా! |
37 |
| మ. |
వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండు మీ తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా! |
38 |
| మ. |
హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదు\న్ గర మొప్ప న్విదురున్ బరాశరసుతున్ గాంగేయుని\న్ ద్రౌపదిన్ నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా! |
39 |
| శా. |
శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులు\న్, లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియు\న్ గల్గు నా లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా! |
40 |