| శతకములు | నారాయణ శతకము |
|
| శా. |
ఏభావంబున ని\న్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై యేభావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం బేభావంబున నీశరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే నాభావంబున నీతలంపుఁ గలుగ న్నా కిమ్ము నారాయణా! |
91 |
| శా. |
నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబున\న్ నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్ నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్ నీప్రాపు సేవించినన్ నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా! |
92 |
| మ. |
నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనుల\న్ విని మోదింపనివాఁడు చెవ్డు మరి ని\న్ వేడ్క\న్ మనోవీథిని\న్ గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా! |
93 |
| మ. |
నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబు తా నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూని వే ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా! |
94 |
| మ. |
నిను వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా! |
95 |
| శా. |
నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ నీవే శంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్ నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా! |
96 |
| మ. |
అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతము\న్ విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికి\న్ గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా! |
97 |
| శా. |
చెల్లం జేసితి పాతకంబులు మది\న్ శ్రీనాథ మీనామముల్ పొల్లుల్ బోవని నమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్ చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ తల్లిం దండ్రియు నీవు గాక యొరులే తర్కింప నారాయణా! |
98 |
| మ. |
నరసిం హాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ ధర గోవింద ముకుంద కేశవ జగత్త్రా తాహితల్పాంబుజో దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం దిర పీతాంబర భక్తవత్సల కృపన్ దీవింపు నారాయణా! |
99 |
| మ. |
కడకంటం గడలేని సంపద లొగిం గావింపు లక్ష్మీశ పా ల్కడలిన్ బన్నగశాయివై భువనముల్ గల్పించు సత్పుత్రుని\న్ బొడమ\న్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ పడతిం గన్న పదారవిందముల నే భావింతు నారాయణా! |
100 |